National Education Policy-2020 (జాతీయ విద్యా విధానం-2020)

National Education Policy-2020(జాతీయ విద్యా విధానం-2020)

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీగా మార్పులకు ఆమోదించింది. దీనికోసం గత సంవత్సరం ప్రభుత్వంఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వం లో ఒక కమిటీ వేసింది. కస్తూరి రంగన్ కమిటీ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

National Education Policy-2020 (జాతీయ విద్యా విధానం-2020)

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ఫొకరియాల్, కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, ప్రాథమిక విద్యలో, b ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలు తీసుకువచ్చేందుకు తెచ్చిన 21వ శతాబ్దపు National Education Policy-2020 (జాతీయ విద్యా విధానం-2020) కేంద్ర కేబినెట్ బుధవారం 29-07-2020 నాడు ఆమోదం తెలిపిందన్నారు.

అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పేరును కేంద్ర విద్యాశాఖ గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి స్కూల్ అథార్టి ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు.

Recent changes in Education system in India

1986 లో లో విద్యా విధానంలో చేసిన మార్పుల తర్వాత 34 ఏళ్ల పాటు ఎలాంటి సంస్కరణలకు నోచుకోకుండా ఉన్న విద్యా విధానంలో ఇది కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు.1947 నుంచి 1986 వరకు ఈ శాఖను కేంద్ర విద్యాశాఖ అని పిలిచేవారు. 1986 తర్వాత దీన్ని కేంద్ర మానవ వనరుల శాఖ గా మార్పు చేశారు. స్వాతంత్ర్యానంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రులు మరియు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రులు 1986 నుంచి 2020 వరకు కేంద్ర మానవ వనరుల శాఖ పిలువబడి ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించి దీనిని కేంద్ర విద్యా శాఖ గా మార్పు చేశారు. ఇది ఒక కీలక మార్పు.

National Education Policy-2020 Highlights

💠 నాలుగు దశల్లో నూతన విద్యా విధానం ఉంటుందని ప్రకటించింది.
💠21వ శతాబ్దపు సవాళ్లను అధిగమించి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెల్లివిరిసేలా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించింది.
💠 మూడు నుంచి 18 ఏళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్య
💠 ప్రతి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ
💠 నాలుగు దశల్లో విద్యావిధానం 5+3+3+4.
💠 మొదటి ఐదు ఏళ్లలో ఫౌండేషన్ కోర్సుగా ప్రకటిస్తారు. ఇందులో మూడు ఏళ్లు ప్రీ ప్రైమరీ తో పాటు రెండేళ్లు గ్రేడ్-1, గ్రేడ్-2 ఉంటాయి.
💠తర్వాత మూడు ఏళ్లు ప్రిపరేటరీ పీరియడ్ గా వ్యవహరిస్తారు. ఇందులో గ్రేడ్-3 గ్రేడ్-4 గ్రేడ్-5 ఉంటాయి.
💠తరువాతి మూడు ఏళ్ల ను మిడిల్ స్టేజ్ గా పిలుస్తారు. ఇందులో గ్రేడ్-6 గ్రేడ్-7 గ్రేడ్-8 లు ఉంటాయి.
💠 తర్వాతి నాలుగేళ్ల ను హై స్టేజ్ గా పిలుస్తారు. ఇందులో గ్రేడ్-9 గ్రేడ్-10 గ్రేడ్-11 గ్రేడ్-12 లు ఉంటాయి.
💠 త్రిభాషా సూత్రాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
💠మౌలిక పాఠ్యాంశాలను కుదించి అప్లికేషన్స్ ఆధారిత విద్యావిధానాన్ని తేవాలని భావిస్తోంది.
💠ప్రాథమిక విద్యను అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా మాతృభాషలోనే బోధించాలని నిర్ణయించింది.
💠 ఆరవ తరగతి నుంచి వోకేషన్ కోర్సులను తీసుకురానున్నారు.
💠 పాఠ్యప్రణాళికలో పాటలు, యోగ, మార్షల్ ఆర్ట్స్, డాన్స్ తప్పనిసరిగా ఉంటాయి. వారి వారి ఇష్టానుసారంగా కోర్సును ఎన్నుకొని నేర్చుకోవచ్చు.
💠అన్నీ కస్తూర్బా పాఠశాలలో గ్రేడ్-12 వరకు ఉంటాయి అని పేర్కొన్నారు.
💠 2025 వరకు అందరికీ విద్య అని లక్ష్యం సాధించాలని అన్నారు.అనగా కచ్చితంగా గ్రేడ్ 12 వరకు ఉచిత నిర్బంధ విద్య 14 సంవత్సరాలు తప్పనిసరిగా చదవాలి.
💠గ్రేడ్-12 తర్వాత రెండేళ్లు కోర్సు చేస్తే డిప్లమాగా ఒక సంవత్సరం చేస్తే వృత్తివిద్య గా పేర్కొనవచ్చు అన్నారు.
💠 డిగ్రీ తర్వాత పీజీ చేసి డైరెక్ట్ పీహెచ్డీ చేయవచ్చన్నారు. Mphil అవసరం లేదని పేర్కొన్నారు.

Comments