భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. రాష్ట్రపతికి ఎలాంటి హోదా ఉంటుందో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కి అదే హోదా ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యనిర్వాహక అధిపతి అయితే గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి. రాష్ట్రంలోని అన్ని కార్యనిర్వాహక చర్యలు గవర్నర్ పేరిట జరుగుతాయి. వాస్తవానికి గవర్నర్ వివిధ కార్యనిర్వాహక చర్యలకు తన సమ్మతి తెలుపుతారు.రాష్ట్ర పరిపాలన విషయంలో ఆయనకు ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారాలు ఉండవు. రాష్ట్ర పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో నిజమైన అధికారాలు ముఖ్యమంత్రి, మంత్రి మండలికే ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ తప్పనిసరి.అయితే 1956లో చేసిన ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఒకే వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమితులు కావచ్చు.
లెఫ్టినెంట్ గవర్నర్
రాష్ట్రానికి గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అండమాన్ & నికోబార్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పదవిలో నియమితులైన వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్లు గా వ్యవహరిస్తారు. ఇతర కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్ లకు ఈ పదవిలో ఉండే వ్యక్తిని అడ్మినిస్ట్రేటర్ లేదా చీఫ్ కమిషనర్ గా పేర్కొంటారు. దీనికి చండీగఢ్ మినహాయింపు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ చండీగఢ్ కు అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరిస్తారు. సాధారణంగా దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ ప్రాంతాలకు ఒకే వ్యక్తి ఏకకాలంలో అడ్మినిస్ట్రేటర్ గా ఉంటారు. ఆర్టికల్ 239 ప్రకారం భారత దేశ అధ్యక్షుడు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన అధిపతి, అధికారి, నిర్వాహకుడు. ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి మినహా మిగిలిన అన్ని కేంద్రపాలిత వ్యవస్థలను నియంత్రించే అధికార యంత్రాంగాన్ని భారత దేశ అధ్యక్షుడు కి ఆర్టికల్ 240(2) కల్పించింది. ఢిల్లీ, పుదుచ్చేరిలో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఉన్నందున వాటిని పాక్షిక కేంద్రపాలిత ప్రాంతాలుగా పిలుస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర గవర్నర్ కి సమాన అధికారాలు ఉంటాయి. ఇద్దరిని ఐదేళ్ళ పదవీ కాలం కోసం దేశ అధ్యక్షుడు నియమిస్తారు. ఒక రాష్ట్ర గవర్నర్ అదే సమయంలో మరో కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేయవచ్చు.
ఆర్హతలు
- ఆర్టికల్ ఒక 157, 158 గవర్నర్ అర్హతలను తెలుపుతాయి.
- భారత పౌరుడై ఉండాలి.
- వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
- పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, మండలి సభ్యుడిగా ఉండకూడదు.
- స్వలాభం చేకూర్చే కార్యవర్గం, వ్యవస్థలో ఎలాంటి పదవి, ఉద్యోగం చేపట్టకుండా ఉండాలి.
అధికారాలు
రాష్ట్ర గవర్నర్ కు కొన్ని కార్యనిర్వాహక, శాసన, న్యాయ అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి లా గవర్నర్ కి దౌత్యపరమైన, సైనికాధికారాలు లేవు. కొన్ని విచక్షణ లేదా అత్యవసర అధికారాలు ఉన్నాయి.
కార్యనిర్వాహక అధికారాలు
ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకున్న పార్టీని అధికారం చేపట్టాలని ఆహ్వానిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలిని నియమించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ మంత్రిమండలిని నియమిస్తారు. అడ్వకేట్ జనరల్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించే అధికారం గవర్నర్ కి ఉంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లను నియమిస్తారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ ను సంప్రదించవచ్చు. జిల్లా కోర్టు న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు.విధానసభలో ఆంగ్లో-ఇండియన్ వర్గానికి తగినంతగా ప్రాతినిథ్యం లభించలేదని గవర్నర్ భావిస్తే ఆ వర్గం నుంచి ఒక సభ్యున్ని రాష్ట్ర శాసనసభకు ప్రతిపాదించవచ్చు. కళలు సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక సేవ వంటి రంగాలకు చెందిన ప్రముఖులను శాసనమండలి సభ్యులుగా నామినేట్ చేసే హక్కు గవర్నర్ కు ఉంది.
శాసన అధికారాలు
గవర్నర్ రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. అలాగే శాసనసభను రద్దు చేసే అధికారం ఉంది. కానీ ఇవి నామమాత్రపు అధికారాలు మాత్రమే. వాస్తవానికి, అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు గవర్నర్ ముఖ్యమంత్రి, మంత్రిమండలితో చర్చించి మార్గనిర్దేశం చేయాలి.ప్రతి సంవత్సరం శాసనసభ తొలి సమావేశం రోజు పాలక ప్రభుత్వ నూతన పరిపాలనా విధానాలను గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రసంగిస్తారు. వార్షిక ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టి, గాడ్స్ మంజూరుకు సిఫార్సు చేస్తారు. రాష్ట్ర ఆర్థిక కమిషన్ ను సంప్రదించి, అత్యవసర పరిస్థితుల సమయంలో రాష్ట్ర కంటింజెన్సీ ఫండ్ వినియోగంపై అధికారం కలిగి ఉంటారు. శాసనసభ ఆమోదించిన అన్ని బిల్లులు గవర్నర్ ఆమోదించిన తర్వాతే చట్టంగా మారుతాయి. అది ఒక మనీ బిల్లు కానట్లయితే, గవర్నర్ పునఃపరిశీలన కోసం విధానసభకు తిరిగి పంపవచ్చు.విధాన సభ బిల్లును గవర్నర్ కు రెండోసారి పునఃపరిశీలన కోసం పంపితే, అప్పుడు తప్పనిసరిగా బిల్లుపై సంతకం చేయాల్సి ఉంటుంది. శాసనసభ సమావేశాలు లేని కాలంలో ఆర్డినెన్స్ ను జారీ చేసే అధికారం గవర్నర్ కు ఉంది. అయితే ఆ శాసనం రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టి తర్వాత ఆరు వారాల పాటు అమలులో ఉంటుంది. శాసనసభ ఆమోదిస్తే చట్టం శాశ్వత రూపం దాలుస్తుంది.
ఆర్థిక కమిషన్
ఆర్టికల్ 243-I ప్రకారం గవర్నర్ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్థిక కమిషన్ ను ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్ పదవీకాలం ఐదేళ్లు. ఆర్థిక కమిషన్ పలు విషయాల పై గవర్నర్ కు సిఫార్సులు చేస్తుంది. రాష్ట్రం, పంచాయతీ ల మధ్య పన్నులు, రుసుము, టోలు రుసుముల పంపిణి, పంచాయతీల మధ్య ఆదాయ కేటాయింపు, ఏకీకృత నిధి నుంచి పంచాయతీలకు మంజూరు చేసిన నిధులు, పంచాయతీల ఆర్థిక స్థితిని మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. పంచాయతీల ఆర్థిక ప్రయోజనాలు, ప్రగతి కోసం కమిషన్ సూచించిన ఏదైనా ఇతర విషయంపై కమిషన్ కూర్పు, దాని సభ్యుల అర్హతలు, వారి ఎంపికను రాష్ట్ర శాసనసభకు గవర్నర్ ప్రతిపాదించవచ్చు. ఆర్థిక కమిషన్ తీసుకొన్న చర్యలు, చేసిన సిఫార్సులను శాసనసభ ముందు గవర్నర్ ఉంచుతారు. పంచాయతీల ఆర్థిక వనరుల కు అనుగుణంగా రాష్ట్రంలోని ఏకీకృత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలను సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సూచిస్తారు.
న్యాయ అధికారాలు
ఆర్టికల్ 161, 162 గవర్నర్ కు గల న్యాయ అధికారాలను నిర్వచిస్తాయి. నేరస్థులకు క్షమాభిక్ష, శిక్ష ను మార్చే అధికారం, శిక్షను తగ్గించే లేదా రద్దు చేసే అధికారం గవర్నర్ కు ఉంది. మరణశిక్ష మినహా ఈ శిక్షకు అయినా క్షమాభిక్ష, శిక్ష నుంచి ఉపశమనం లేదా రద్దు చేయవచ్చు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో రాష్ట్రపతి గవర్నర్ ను సంప్రదిస్తారు.
అత్యవసర అధికారాలు
రాష్ట్ర విధానసభలో ఏ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే తన ఆభిస్టాన్ని, అనుభవాన్ని, విచక్షణని ఉపయోగించి ఏ పార్టీని ఆహ్వానించాలో నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్ కు ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, పాలనా యంత్రాంగం విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని, అనిశ్చితిని అధికారిక నివేదికలో రాష్ట్రపతి తెలియజేస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేసే అధికారం, రాష్ట్రపతి తరపున ప్రెసిడెంట్ రూల్ ను విధించే అధికారాన్ని కలిగి ఉంటారు. ప్రెసిడెంట్ రూల్ లేదా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర మంత్రి మండలి సలహాలను లేదా కార్యాచరణలను అధిగమించే అధికారం గవర్నర్ కు ఉంది.
గవర్నర్ జీతం
గవర్నర్ భత్యాలు, మంజూరు చట్టం 1982లో పేర్కొన్న విధంగా గవర్నర్ నెలవారీ జీతం రూ. 1,10,000. 2018-19 కేంద్ర బడ్జెట్లో సవరించి రూ. 3,50,000 చేశారు. ఒక గవర్నర్ ఒకే సమయంలో బహు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తే జీతభత్యాలు ఆయా రాష్ట్రాల మధ్య పంచుతారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గవర్నర్ నిర్దిష్టమైన పింఛను, వైద్య ప్రయోజనాలు వంటి అలవెన్స్ లకు అర్హులు
పదవి కాలం - అభిశంసన
గవర్నర్ ఐదేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారు. కానీ రాష్ట్రపతి అసంతృప్తి చెందితే గవర్నర్ ను తొలగించవచ్చు.వాస్తవానికి ప్రధానమంత్రి సలహా మేరకు గవర్నర్ తొలగింపుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. అవినీతి, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినప్పుడు గవర్నర్ ను తొలగిస్తారు లేదా రాజీనామా చేయమని కోరతారు. కేంద్రంలో అధికార మార్పిడి జరిగినప్పుడు, కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు గవర్నర్లు తమ పదవికి రాజీనామా చేస్తారు. గవర్నర్ పదవిలో కొనసాగడానికి, నియామకానికి గరిష్ట వయస్సు పరిమితి లేదు. పదవి విరమణ వయసు కూడా రాజ్యాంగంలో పొందుపరచిన లేదు. రాష్ట్రపతిని అభిశంసన చేసే వీలు రాజ్యాంగం కల్పించినట్టు, గవర్నర్ అభిశంసన చేసే ఎలాంటి నిబంధనను రాజ్యాంగంలో పొందుపరచ లేదు.
గవర్నర్ పై నేరారోపణలు
ఆర్టికల్ 361(1),(2),(3) గవర్నర్ కి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ వివరిస్తాయి.- గవర్నర్ పదవిలో ఉండగా విధినిర్వహణ, అధికార దుర్వినియోగం, పనితీరు గురించి ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదని ఆర్టికల్ 360(1) సూచిస్తుంది.
- ఆర్టికల్ 361(2) ప్రకారం, ఏ కోర్టులోనూ గవర్నర్ పై ఎలాంటి నేరారోపణల ప్రక్రియ కొనసాగవు.
- గవర్నర్ ని అరెస్ట్ లేదా ఖైదీ చేసే ఈ ప్రక్రియ ఏ కోర్టు నుంచి జారీ చేయరాదని ఆర్టికల్ 361(3) తెలుపుతుంది.
మహిళా గవర్నర్లు
స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. 1947 ఆగస్టు 15 నుంచి 1949 మార్చి 2 వరకు ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించారు. ఆమె కుమార్తె పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా 11ఏళ్ల సుదీర్ఘ కాలం పని చేసి రికార్డు సృష్టించారు.అవిభక్త ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ గా శారద ముఖర్జీ నియమితులై 1977 నుంచి 1978 వరకు పదవిలో కొనసాగారు.
💠 సరోజినీ నాయుడు - ఉత్తర ప్రదేశ్ ~ 1947, ఆగస్టు నుంచి 1949, మార్చి వరకు.
💠 పద్మజా నాయుడు - పశ్చిమ బెంగాల్ ~ 1956, నవంబరు నుంచి 1967, మే వరకు.
💠 విజయలక్ష్మి పండిట్ - మహారాష్ట్ర ~ 1962, నవంబరు నుంచి 1964, అక్టోబర్ వరకు.
💠 శారదా ముఖర్జీ - ఆంధ్ర ప్రదేశ్ ~ 1977, మే నుంచి 1978, ఆగస్టు వరకు
💠 జ్యోతి వెంకటాచలం - కేరళ ~ 1977, అక్టోబరు నుంచి 1982, అక్టోబరు వరకు.
💠 శారదా ముఖర్జీ - గుజరాత్ ~ 1978 ఆగస్టు, నుంచి 1983, ఆగస్టు వరకు
💠 కుముద్ బెన్ జోషి - ఆంధ్ర ప్రదేశ్ ~ 1985, నవంబరు నుంచి 1990, ఫిబ్రవరి వరకు
💠 రామ్ దులారి సిన్హా - కేరళ ~ 1988, ఫిబ్రవరి నుంచి 1990, ఫిబ్రవరి వరకు
💠 సరళ గ్రేవాల్ - మధ్యప్రదేశ్ ~ 1989, మార్చి నుంచి 1990, ఫిబ్రవరి వరకు
💠 చంద్రావతి - పుదుచ్చేరి ~ 1990, ఫిబ్రవరి నుంచి 1990, డిసెంబరు వరకు
💠 రాజేంద్ర కుమారి బాజ్ పాయ్ - పుదుచ్చేరి - 1995 మీ నుంచి 1998 ఏప్రిల్ వరకు
💠 షీలా కౌల్ - హిమాచల్ ప్రదేశ్ ~ 1995 నవంబరు నుంచి 1996 ఏప్రిల్ వరకు
💠 ఫాతిమా బీవీ - తమిళనాడు ~ 1997 జనవరి నుంచి 2001 జూలై వరకు
💠 వి.ఎస్. రమాదేవి - హిమాచల్ ప్రదేశ్ ~ 1997, జూలై నుంచి 1999, డిసెంబరు వరకు
💠 రజనీ రాయ్ - పుదుచ్చేరి ~ 1998, ఏప్రిల్ నుంచి 2002, జూలై వరకు
💠 వి.ఎస్. రమాదేవి - కర్ణాటక ~ 1999, డిసెంబరు నుంచి 2002, ఆగస్టు వరకు
💠 ప్రతిభా పాటిల్ - రాజస్థాన్ ~ 2004, నవంబరు నుంచి 2007, వరకు
💠 ప్రభారావ్ - హిమాచల్ ప్రదేశ్ ~ 2008, జూలై నుంచి 2010, జనవరి వరకు
💠 మార్గరెట్ ఆల్వా - ఉత్తరాఖండ్ ~ 2009, ఆగస్టు నుంచి 2012,మే వరకు
💠 కమలా బేనివాల్ - గుజరాత్ ~ 2009, నవంబరు నుంచి 2014, జూలై వరకు
💠 ప్రభారావ్ - రాజస్థాన్ ~ 2010, జనవరి నుంచి 2010, ఏప్రిల్ వరకు
💠 ఊర్మిళ సింగ్ - హిమాచల్ ప్రదేశ్ ~ 2010, జనవరి నుంచి 2015, జనవరి వరకు
💠 మార్గరెట్ ఆల్వా - రాజస్థాన్ ~ 2012, మే నుంచి 2014, ఆగస్టు వరకు
💠 షీలా దీక్షిత్ - కేరళ - 2014, మార్చి నుంచి 2014, ఆగస్టు వరకు
💠 కమలా బేనివాల్ - మిజోరాం ~ 2014, జూలై నుంచి 2014, ఆగస్టు వరకు
💠 మృదులా సిన్హా - గోవా ~ 2014, ఆగస్టు నుంచి 2019, అక్టోబర్ వరకు
💠 ద్రౌపది ముర్ము - జార్ఖండ్ ~ 2015, మే నుంచి కొనసాగుతున్నారు.
💠 కిరణ్ బేడి - పుదుచ్చేరి ~ 2016, మే నుంచి కొనసాగుతున్నారు.
💠 నజ్మా హెప్తుల్లా - మణిపూర్ ~ 2016, ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు.
💠 ఆనంది బెన్ పటేల్ - ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ~ 2018, జనవరి నుంచి కొనసాగుతున్నారు.
💠 బేబీ రాణి మౌర్య - ఉత్తరాఖండ్ ~ 2018 ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు.
💠 అనసూయ ఊకె - చత్తీస్ గడ్ ~ 2019, జూలై నుంచి కొనసాగుతున్నారు.
💠 తమిళ్ సాయి సౌందర్య రాజన్ - తెలంగాణ ~ 2019, సెప్టెంబర్ నుంచి కొనసాగుతున్నారు.
Note:పై పట్టికలో చంద్రావతి, రాజేంద్ర కుమారి బాజ్ పాయ్, రజనీ రాయ్, కిరణ్ బేడీ వీళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ లు.
English Translation
President of India's first citizen. The Governor has the same status as the President at the state level. The Governor is the nominal head of the state while the chief minister is the executive head. All the executive functions of the State are done in the name of the Governor. In fact, the governor gives his consent to various executive actions. He has no powers to make decisions on state administration. The real powers in the administration and executive affairs of the state lie with the Chief Minister and the Council of Ministers. According to Article 153 of the Constitution, a governor is mandatory for each state.
Lieutenant Governor
Governor of the State, Lieutenant Governor or Administrator of Union Territories. In the Union Territories of Andaman & Nicobar, Puducherry, a person appointed to that post will serve as Lieutenant Governors. In other Union Territories of Chandigarh, Dadra Nagar Haveli, Daman & Diu, Lakshadweep, the person in this position is referred to as the Administrator or Chief Commissioner. Chandigarh is an exception to this. The Governor of the Punjab State is the Administrator of Chandigarh. Generally, the same person is the Administrator for Dadra Nagar Haveli, Daman & Diu areas. According to Article 239, the President of India is the head, officer and administrator of all Union Territories. Article 240(2) gave the President of India the authority to regulate all the Union Territories except Delhi, Chandigarh and Puducherry. In Delhi and Puducherry, people are called semi-union territories because they have an elected government. The Lieutenant Governor and the Governor of the State have equal powers. The two are appointed by the President of the country for a five-year term. A state governor may at the same time act as lieutenant governor of another Union Territory.
qualifications
- Article 157, 158 outlines governor qualifications.
- Must be an Indian citizen.
- The age should be 35 years
- No member of Parliament, State Legislature or Council.
- The self-serving working class should not take up any position in the system.
powers
The Governor of the State has certain executive, legislative and judicial powers. The President's Law Governor has no diplomatic or military powers. There are some discretionary or emergency powers.
executive privileges
The party that wins the most seats in the election is invited to take office. The Chief Minister appoints and takes the oath of office. The Governor shall appoint a Cabinet of Ministers on the recommendation of the Chief Minister. The Governor has the power to appoint members of the Advocate General and Chairman of the State Public Service Commission. Vice Chancellors of State Universities are appointed. The President and the Governor may be consulted on the appointment of Judges of the State High Court. The district court judges are appointed by the governor. The Governor has the right to nominate persons from the fields of arts, literature, science and social service as members of the Legislative Council.
Legislative powers
The governor may address legislators in the state legislature. Also has the power to repeal the legislature. But these are only nominal powers. In fact, before making such decisions, the governor must consult and guide the chief minister and the cabinet. The annual financial report is introduced and recommended for the Gods grant. Contact the State Finance Commission and authorize the use of the State Contingency Fund during emergencies. All bills passed by the Legislature become law after they are approved by the Governor. If it is not a money bill, the governor may send it back to the House of Commons for reconsideration. The governor has the power to issue the ordinance in the absence of legislative meetings. The legislation, however, will go into effect in the state legislature for six weeks. If the Legislature approves, the law will make it permanent.
Financial Commission
The Governor shall establish a Finance Commission to review the financial condition of the Panchayats under Article 243-I. The term of this Commission is five years. The Finance Commission makes recommendations to the Governor on many matters. Measures to improve the financial status of the panchayats and the funds allocated to the panchayats from the consolidated fund, the allocation of income between the state and the panchayats, the distribution of taxes and fees, the allocation of income among the panchayats. The Governor may propose to the State Legislature the composition of the Commission, the qualifications of its members, and their option in respect of the financial interests of the Panchayats and any other matter referred to by the Commission. The Governor will place before the legislature the recommendations made by the Finance Commission. The Central Finance Commission refers to the measures required to increase the consolidated funds of the State in accordance with the financial resources of the Panchayatsjudicial powers
Articles 161 and 162 define the judicial powers of the governor. The Governor has the power to pardon the offenders, amend the sentence, and reduce or repeal the sentence. This punishment, except for the death penalty, can be either pardoned or relieved of the punishment.
Emergency Powers
The governor has the power to decide which party to invite, using his expertise, experience and discretion if any political party does not get an absolute majority in the state assembly. The President has the power to recommend the President's Rule to the President in the Official Report of the State in the Official Report of the situation and uncertainty in the State when the security of the Peace is disturbed. The Governor has the authority to override the suggestions or actions of the State Council of Ministers when the President's Rule or President's rule is imposed.
Governor's salary
The Governor's Allowances, as set forth in the Grants Allowance Act 1982, pays the Governor a monthly salary of Rs. 110,000. Revised in the Union Budget 2018-19 3,50,000 were made. If a governor acts as governor of multiple states at the same time, salaries are shared between the states. According to the Constitution, the Governor of the State is entitled to certain pensions and medical benefits.
term of office - impeachment
The governor will continue in office for five years. But if the president is dissatisfied, the governor can be removed. In case of corruption and violation of the constitution, the governor is removed or resigned. Governors resign from their posts when power is transferred at the center and a new government is formed. There is no maximum age limit for the appointment to continue as governor. The age of retirement is not even enshrined in the Constitution. The Constitution does not include any provision that can impeach the Governor, as the Constitution provides for the indictment of the President.
indictment on governor
Article 361 (1), (2), and (3) describe criminal proceedings against the Governor.- Article 360 (1) indicates that no court is held accountable for duty, abuse of power and performance while in office.
- Article 361 (2) provides that no criminal proceedings shall be pursued in any court.
- Article 361 (3) states that the process of arresting or detaining the governor should not be issued by any court.
Female Governors
Sarojini Naidu is the first woman Governor of independent India. From August 15, 1947 to March 2, 1949, he was Governor of the Uttar Pradesh. Her daughter Padmaja Naidu has set a record for the longest serving 11 years as governor of West Bengal.
💠 Sarojini Naidu - Uttar Pradesh ~ August 1947 to March 1949.
💠 Padmaja Naidu - West Bengal ~ November 1956 to May 1967
💠 Vijayalakshmi Pandit - Maharashtra ~ 1962, November to 1964, October to
💠 Sharada Mukherjee - Andhra Pradesh ~ 1977, May to August 1978
💠 Jyoti Venkatachalam - Kerala ~ 1977, October to 1982, October.
💠 Sharada Mukherjee - Gujarat ~ August 1978 to August 1983
💠 Kumud Ben Joshi - Andhra Pradesh ~ 1985, November to 1990, February
💠 Ram Dulari Sinha - Kerala ~ 1988, February to 1990, February
💠 Sarala Grewal - Madhya Pradesh ~ 1989, March to February 1990,
💠 Chandravati - Puducherry ~ 1990, February to December 1990, December
💠 Rajendra Kumari Baz Pai - Puducherry - 1995 to April 1998
💠 Sheila Kaul - Himachal Pradesh ~ November 1995 to April 1996
💠 Fatima Beevi - Tamil Nadu ~ January 1997 to July 2001
💠 V.S. Ramadevi - Himachal Pradesh ~ 1997, July to 1999 December,
💠 Rajani Roy - Puducherry ~ 1998, April to 2002, July
💠 V.S. Ramadevi - Karnataka ~ 1999, December to 2002 August
💠 Pratibha Patil - Rajasthan ~ 2004, November to 2007, June
💠 Prabha rao - Himachal Pradesh ~ 2008, July to January 2010
💠 Margaret Alva - Uttarakhand ~ 2009, August to 2012 May
💠 Kamala Beniwal - Gujarat ~ November 2009 to July 2014
💠 Prabharao - Rajasthan ~ January 2010 to April 2010,
💠 Urmila Singh - Himachal Pradesh ~ January 2010 to January 2015
💠 Margaret Alva - Rajasthan ~ May 2012 to August 2014
💠 Sheila Dixit - Kerala - March 2014 to August 2014,
💠 Kamala Beniwal - Mizoram ~ July 2014 to August 2014
💠 Mridula Sinha - Goa ~ August 2014 to October 2019
💠 Draupadi Murmu - Jharkhand ~ Continuing from May 2015
💠 Kiran Bedi - Puducherry ~ Continued from May 2016
💠 Najma Heptullah - Manipur ~ Continuing from August 2016.
💠 Anandi Ben Patel - Uttar Pradesh & Madhya Pradesh ~ Continuing January, 2018.
💠 Baby Rani Maurya - Uttarakhand ~ Continuing from August 2018.
💠 Anasuya uikey - Chhattisgarh ~ Continuing from July 2019.
💠 TamiliSai SoundaryaRajan - Telangana ~ continuing from September 2019.
Note: The table above, Chandravati, Rajendra Kumari Bajpai, Rajani Roy and Kiran Bedi are Lieutenant Governors.
👌
ReplyDelete