Siamese Fighting Fish
కోడి పందాలు చూసే ఉంటారు. గుర్రపు పందాల గురించి వినే ఉంటారు. కానీ చేప పందాలను ఎప్పుడైనా చూశారా? వాటి గురించి విన్నారా? "బెట్టా ఫిష్ " అని పిలిచే చేపలు కోళ్ల మాదిరిగా ఫైటింగ్ కు సై అంటుంటాయి. రకరకాల రంగు, ఆకట్టుకొనే రెక్కలతో కనిపించే చేపల కబుర్లు
రకరకాల రంగుల్లో, ఆకర్షణీయమైన రెక్కలతో బెట్టా ఫిష్ చూడగానే ఆకట్టుకుంటాయి.మొదట వీటిని దక్షిణాసియా ప్రాంతంలో కనుగొన్నారు. ఇవి చాలా తెలివైన చేపలు. వీటికి "సియమీస్ ఫైటింగ్ ఫిష్" అని కూడా పేరుంది.

- వీటిని సర్వభక్షకులు అని చెప్పొచ్చు. దోమల లార్వాలు, చిన్న చిన్న కీటకాలు, చిన్న చిన్న చేపలు, పురుగులు తింటాయి. థాయ్ల్యాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువాగ్స్ కనిపిస్తాయి. వీటిలో 70 రకాల జాతులున్నాయి. సాధాహరణంగా కనిపించే రకం "betta splendens".
- ఈ చేపలను అక్వేరియం లో పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు. తక్కువ ఆక్షిజన్ ఉన్న నీటిలో కూడా ఇవి జీవిస్తాయి. చిన్న కొలను, తక్కువ వేగంతో ప్రవహించే నదుల్లో ఈ చేపలు ఎక్కువగా జీవిస్తాయి. వీటి జీవితకాలం 2-3 సంవత్సరాలు ఉంటుంది.
- Betta spendens చేపలను పందాల కోసం, ప్రదర్శన కోసం ఉపయోగిస్తుంటారు. థాయ్ ల్యాండ్ ప్రజలు వీటి ఫైటింగ్ పై పందాలు కాడి డబ్బు సంపాదిస్తుంటారు. మగ చేపలు మాత్రమే పోరులో పాల్గొంటాయి. ఇతర ప్రాంతం లో నుంచి వచ్చిన మగ చేపలను చూసి కయ్యానికి కాలు దవ్వుతాయి.
- మగ చేపలు తమ సంతానాన్ని నిరంతరం కాపాడుతూ ఉంటాయి. బెట్టా రెక్కలలో నాడీ కణాలు, రుచి మొగ్గలు ఉంటాయి. మగ చేప 5 అంగుళాల వరకు పొడవు పెరుగుతుంది.
- బెట్టా ఫిష్ తన శరీర ఉష్ణోగ్రత ను నియంత్రించుకోలేదు. వాటి రెక్కల రంగు తగ్గిపోయిందంటే అది అనారోగ్యాంగా ఉందని అర్థం.
- ఈ చేపలు మొక్కలను ఎంతో ఇష్టపడతాయి. మొక్కల ఆకులపై ఇవి సేదతీరుతాయి.
- బెట్టా లో "లాబ్రింత్" అనే ఒక ప్రత్యేక అవయవం ఉంటుంది. నీటి పైకి వచ్చినప్పుడు శ్వాసించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎన్నో ప్రత్యేకతలున్న బెట్టా చేప భలేగా ఉంది.
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box