భారత్ లో స్వాతంత్ర్యానంతర విద్యా వ్యవస్థ
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన గౌరవార్థం కలాం జయంతిని జాతీయ విద్యా దినోత్సవం గా 2008లో ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోజున దేశ వ్యాప్తంగా విద్య ప్రాముఖ్యం పై సెమినార్లు, సమావేశాలు, వ్యాసరచన, వకృత్వ పోటీలు, వర్క్ షాపులను యూజీసీ నిర్వహిస్తుంది.
మౌలానా అబుల్ కలాం ఆజాద్
దేశం విభజన, పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన మొదటి ముస్లిం నాయకుడు. ఆయన ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, పాత్రికేయుడు. బ్రిటిషర్ల ఆకృత్యాల పై పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. ఆయన అసలు పేరు అబుల్ కలాం గులాం మొహియుద్దీన్. కలం పేరు ఆజాద్. మౌలానా అని ఆయన్ని గౌరవపూర్వకంగా పిలిచేవారు, మౌలానా అంటే గురువు అని అర్థం. ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించి గాంధీ దృష్టిలో పడ్డారు. అప్పటి నుంచి గాంధీ తో ఆయనకు సాన్నిహిత్యం పెరిగింది. సహాయ నిరాకరణోద్యమం, స్వీయ పాలన, స్వదేశీ వస్తువులు, క్విట్ ఇండియా తదితర పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన చేసిన అమూల్యమైన కృషి, త్యాగం, సేవలను గుర్తించిన ప్రభుత్వం మరణానంతరం 1992లో దేశ అత్యున్నత పౌర పురస్కారం'భారత రత్న' ను మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఇచ్చింది.
ప్రథమ విద్యాశాఖ మంత్రి
1947 నుంచి 1958 వరకు పదేళ్లకు పైగా స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యా శాఖ గా మంత్రి మౌలానా అబుల్ కలాం వ్యవహరించారు. భావి పౌరులను తయారుచేసే ప్రయోగశాలలు గా పాఠశాలలను ఆయన పరిగణించేవారు. విద్యావంతులైన పౌరులు జాతి నిర్మాణానికి దోహదపడతాయి. కాబట్టి దేశంలోని విద్యా సంస్థలు నాణ్యమైన విద్య అందించాలని ఆయన పరితపించే వారు. విద్య, దేశం పురోగతి, అభివృద్ధి మధ్య అవినాభావ సంబంధాన్ని, ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించేవారు. సార్వజనీన ప్రాథమిక విద్య బాలికలకు విద్యా హక్కు, బాలలకు వృత్తి శిక్షణ, సాంకేతిక విద్య, 14 ఏళ్ల వయసు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్య వంటి సంస్కరణల కోసం కృషి చేశారు. దేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం అప్పట్లో అధికంగా ఉండేది దాంతో ఆయా అక్షరాస్యతను పెంపొందించడానికి ఇతోధికంగా కృషి చేశారు. ఆ క్రమంలో వయోజన విద్య, వృత్తి శిక్షణ, విభిన్నత తో కూడిన ఉన్నత మాధ్యమిక విద్య వంటి విషయాలపై దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా వ్యూహాన్ని రచించి, విద్యా ప్రణాళికలు అమలు చేశారు. భారతదేశంలో ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలను నెలకొల్పడంలో మౌలానా కృషి ఉంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ ఐ ఎస్ సి) ఏర్పాటుకు బీజం వేశారు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది కూడా ఆయనే. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ను నెలకొల్పారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డ్ ఏర్పాటు కూడా అబుల్ కలాం ఆలోచనే.
సాంస్కృతిక, సాహిత్య అకాడమీలు
కేవలం ప్రాథమిక విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య, అక్షరాస్యత కోసమే కాకుండా, సంస్కృతి, సాహిత్యాలను ప్రోత్సహించడంలో కూడా ఆజాద్ ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం మనుగడలో ఉన్న సాంస్కృతిక, సాహిత్య అకాడమీ లలో చాలా వరకు ఆయన స్థాపించినవే. సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వంటి సంస్థలను మౌలానా ఏర్పాటు చేశారు.
స్మారక చిహ్నాలు
మౌలానా ఆజాద్ గౌరవార్థం దేశమంతటా అనేక సంస్థలకు ఆయన పేరు పెట్టారు.
- న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్
- కోల్ కతాలోని మౌలానా అబుల్ కలం ఆజాద్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ
- భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
- అలీగడ్ లోని అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ లోని మౌలానా ఆజాద్ లైబ్రరీ
- జమ్ములో మౌలానా ఆజాద్ స్టేడియం
- మౌలానా ఆజాద్ సెంటర్
- మౌలానా ఆజాద్ కాలేజీ
- ఆయన నివాస గృహాన్ని'మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆసియన్ స్టడీస్'గా, తరువాత మౌలానా ఆజాద్ లైబ్రరీగా మార్చారు.
హెచ్ ఆర్ డి మినిస్ట్రీ ఆవిర్భావం
1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, విద్యా మంత్రిత్వ శాఖను సెప్టెంబర్ 25న రద్దు చేశారు. దాని స్థానంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించారు. ఇది దేశ విద్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. మానవ అ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను రెండు విభాగాలుగా విభజించారు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ
దీని పరిధిలో ప్రాథమిక, మాధ్యమిక విద్య, ఉన్నత మాధ్యమిక విద్య, వయోజన విద్య, అక్షరాస్యత అభివృద్ధి ఇ మొదలైన అంశాలు ఉంటాయి.
డిపార్ట్ మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
విశ్వవిద్యాలయ విద్య, సాంకేతిక విద్య, స్కాలర్షిప్స్ తదితర విషయాలకు బాధ్యత వహిస్తుంది. 1985 సెప్టెంబరు 26 నుంచి విద్యా మంత్రిత్వ శాఖ ఈ రెండు విభాగాల కింద మిలిత మయింది. కేంద్ర మంత్రి వర్గంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి కేబినెట్ హోదా కలిగి ఉంటుంది.
విద్యాభివృద్ధికి కృషి చేసిన ముఖ్యులు
పి.వి. నరసింహారావు
1985లో రాజీవ్ గాంధీ అప్పటి కేంద్ర విద్యాశాఖ ను రద్దు చేసి మానవ వనరుల అభివృద్ధి శాఖను కొత్తగా ఏర్పాటు చేశారు. మహా మేధావి, పండితుడు అయిన పీవీ నరసింహారావు తగిన వ్యక్తి అని భావించి ఆయనను మానవ వనరుల అభివృద్ధి శాఖకు తొలి మంత్రిని చేశారు. ఆ శాఖలో చేరగానే కొత్త విద్యా విధానం రూపొందించి మౌలికంగా మార్పులు చేర్పులు చేశారు. 1986 నూతన విద్యా విధానంలో భాగంగా జవహర్ నవోదయ సమితి స్కూళ్లు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కూడా పివి పనిచేశారు. 1971-73 లో లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నల్లగొండ జిల్లాలోని సర్వేల్ లో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఏర్పాటుచేసిన తొలి రెసిడెన్షియల్ స్కూల్ ఇదే. అప్పటివరకు దేశంలో ఇలాంటి పాఠశాలలను ఎక్కడ కనీవినీ ఎరగరు. 1971లో ఈ పాఠశాలకు సర్వోదయ నాయకుడైన మద్ది నారాయణరెడ్డి 44 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో వేలమంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు విద్యావంతులను చేయడంలో సహకరించడానికి రాష్ట్రంలో మరెన్నో రెసిడెన్షియల్ స్కూళ్లను తదుపరి రోజుల్లో పాలకులు స్థాపించారు. భారత పురాణ గాథల్లోని "గురుకులాలు" నుంచి నరసింహారావు ప్రేరణ పొందారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు పట్టణాలకు వెళ్లకుండానే, వాళ్లకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశ్యంతో పి.వి 1972లో"ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ" నీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి రోజుల్లో అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్లి లో, గుంటూరు జిల్లాలోని తాడికొండ అ వద్ద గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. తదుపరి ప్రభుత్వాలు క్రమంగా అలాంటి పాఠశాలలను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పాయి.
ఎన్.టి. రామారావు
పీవీ నరసింహారావు రూపొందించిన "ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ" ఆశయాలు, ప్రగతి నచ్చడంతో ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉమ్మడి రాష్ట్రం లోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. అంతేకాకుండా సామాజిక సంక్షేమ శాఖ కింద వెనుకబడిన తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు.
విజయేంద్ర అ కస్తూరి రంగ వరదరాజ రావు
తమిళనాడు కాంచీపురం లో జన్మించారు. ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త, విద్యావేత్త అయిన వరదరాజ రావు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా 1971లో సేవలందించారు. సోషల్ సైన్స్ రీసెర్చ్ లో ప్రసిద్ధ సంఖ్యలను వరదరాజ రావు పాటించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఇన్ స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ఆగ్రో ఎకనామిక్ సెంటర్, పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లను స్థాపించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్థాపనలో వరదరాజ రావు పాత్ర మరువలేనిది.
అటల్ బిహారీ వాజ్ పేయి
2001లో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాఠశాల విద్యా పథకం, సర్వ శిక్ష అభియాన్ (ఎస్ ఎస్ ఏ) ను ఆరంభించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా పథకాల్లో "సర్వ శిక్ష అభియాన్" అత్యంత విజయవంతమైనది. సర్వ శిక్ష అభియాన్ పథకం భారతదేశంలో ప్రాథమిక విద్య పెంపుదల లో సహాయపడింది. అంతేకాకుండా "రైట్ టు ఎడ్యుకేషన్ (విద్యా హక్కు చట్టం) అమలుకు సాధనంగా మారింది.
ప్రతి ఒక్కరికి పాఠశాల అందుబాటులో ఉంచడమే ఆ పథక ముఖ్య ఉద్దేశం. 6 నుంచి 14 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత, నిర్బంధ విద్యను అందించడం దీని లక్ష్యం. సర్వ శిక్ష అభియాన్ ను పరిచయం చేయకముందు ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేవి. 6 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలకు విద్యను మౌలిక హక్కు కల్పించే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని 86వ సవరణ ద్వారా సర్వ శిక్ష అభియాన్ పథకం అమలు అయింది
పంచాయతీ రాజ్, పాఠశాల నిర్వహణ కమిటీలు, గ్రామ పట్టణ మురికివాడల స్థాయి విద్యా సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు, మదర్ టీచర్ అసోసియేషన్, గిరిజన అటానమస్ కౌన్సిల్ వంటి దేశంలోని అన్ని సంస్థలను వాజపేయి ప్రభుత్వం ఒక తాటి మీదకి తెచ్చి, విజయవంతంగా ఈ పథకం అమలయ్యేలా చూసింది
మన్మోహన్ సింగ్
ప్రాథమిక స్థాయిలో ప్రస్తుతం దేశంలో 14.5 లక్షల ప్రాథమిక పాఠశాలలో 19.67 కోట్ల మంది పిల్లలకి 66.27 లక్ష్యాల ఉపాధ్యాయులు విద్య అందిస్తున్నారు. సర్వ శిక్ష అభియాన్ నీ ఆధారం చేసుకొని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టం అమలు చేశారు. విద్యా హక్కు చట్టం అమలైన తర్వాత 2009.10 లో పాఠశాలల సంఖ్య రెండు లక్షల నుంచి 2015.16 లో పది లక్షలకు గణనీయంగా పెరిగింది. విప్లవాత్మక మార్పులు జరగకున్నా మరికొందరు విద్యా మంత్రులు సైతం దేశంలో విద్యాభివృద్ధికి తమదైన కృషి చేశారు.
పేర్లు | పదవీకాలం |
---|---|
మౌలానా అబుల్ కలాం ఆజాద్ | 1947, ఆగస్టు - 1958, జనవరి |
కె. ఎల్. శ్రీమాలి | 1958, జనవరి - 1963, ఆగస్టు |
హుమాయూన్ కబీర్ | 1963, సెప్టెంబర్ - 1963, నవంబర్ |
ఎం. సి. చాగ్లా | 1963, నవంబర్ - 1966, నవంబర్ |
ఫకృద్దిన్ అలీ అహ్మద్ | 1966, నవంబర్ - 1967, మార్చి |
త్రిగుణ సేన్ | 1967, . మార్చి - 1969 ఫిబ్రవరి |
విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజ రావు | 1969, ఫిబ్రవరి - 1971, మార్చి |
సిద్ధార్థ్ శంకర్ రే | 1971, మార్చి - 1972, మార్చి |
నూరుల్ హసన్ | 1972, మార్చి, - 1977, మార్చి |
ప్రతాప్ చంద్ర చందర్ | 1977, మార్చి - 1979, జూలై |
కరణ్ సింగ్ | 1979, జూలై - 1980, జనవరి |
బి. శంకరానంద్ | 1980, జనవరి - 1980, అక్టోబర్ |
శంకర్రావు. బి. చౌహాన్ | 1980, అక్టోబర్ - 1981, ఆగస్టు |
షీలా కౌల్ | 1981,ఆగస్టు - 1984, డిసెంబర్ |
కెసి. పంత్ | 1984, డిసెంబర్ - 1985, సెప్టెంబర్ |
పేర్లు | పదవి కాలం |
---|---|
పి. వి. నరసింహ రావు | 1985, సెప్టెంబర్ - 1988, జూన్టీడీ> |
పి. శివ శంకర్ | 1988, జూన్ - 1989, డిసెంబర్ |
పి. వి. సింగ్ | 1989, డిసెంబర్ - 1990, నవంబర్ |
రాజ్ మంగల్ పాండే | 1990, నవంబర్ - 1991,జూన్ |
అర్జున్ సింగ్ | 1991,జూన్ - 1994, డిసెంబర్ |
పీ.వీ. నరసింహారావు | 1994, డిసెంబర్ - 1995, ఫిబ్రవరి |
మాధవరావు సింధియా | 1995, ఫిబ్రవరి - 1996, జనవరి |
పీ.వీ. నరసింహారావు | 1996,ఫిబ్రవరి - 1996, మే |
అటల్ బిహారీ వాజపేయి | 1996,మే - 1996, జూన్ |
ఎస్. ఆర్. బొమ్మై | 1996,జూన్ - 1998,మార్చి |
మురళీ మనోహర్ జోషి | 1998,మార్చి - 2004,మే |
అర్జున్ సింగ్ | 2004,మే - 2009, మే |
కపిల్ సిబాల్ | 2009,మే - 2012,అక్టోబర్ |
మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు | 2012, అక్టోబర్ - 2014, మే |
స్మృతి ఇరానీ | 2014, మే - 2016, జూలై |
ప్రకాష్ జవదేకర్ | 2016,జూలై - 2019,మే |
రమేష్ ఫోక్రియాల్ | 2019,మే నుంచి కొనసాగుతున్నారు |
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box