భారత రాజ్యాంగ దినోత్సవం(Constitution Day of India)

English Translation also here

భారత ప్రభుత్వం నవంబరు 26వ తేదీ ని రాజ్యంగ దినోత్సవం గా 2015లో ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1949 నవంబరు 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. దానికి గుర్తుగా దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. సంతా రాజ్యాంగం లేని కారణంగా నాటి నుంచి 1950 జనవరి 26 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కిందే దేశంలో పాలన సాగింది. ఈ చట్టాన్ని 1935 ఫిబ్రవరిలో రూపొందించారు. అయితే బ్రిటిష్ రాజు ఆమోదం జూలై 1935లో పొందాక అధికారికంగా అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగ సభ మొదటి సమావేశం

1946 డిసెంబరు 9న న్యూఢిల్లీలోని రాజ్యాంగ హాల్ లో మొదటిసారి రాజ్యాంగ సభ సమావేశమైంది. నాటి రాజ్యాంగ హాల్ ప్రస్తుతం పార్లమెంటు సెంట్రల్ హాల్. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ ఆర్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, ఆచార్య కృపలానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, శ్రీమతి సరోజినీ నాయుడు, హరే కృష్ణ మెహాతాబ్, పండిట్ గోవింద్ వల్లబ్ పంత్, శరత్ చంద్రబోస్, సి. రాజగోపాలచారి, ఎం. ఆసఫ్ అలీ నీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. తొమ్మిది మంది మహిళలతో సహా 207 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
"భగవంతుడా మేం దేశానికి రాజ్యాంగం రూపొందించడానికి పూనుకున్నామ్. దేవుడి ఆశీర్వాదాలతో ప్రారంభించిన పని సజావుగా, నిరాటంకంగా సాగాలి" అని అని ఆచార్య జీవత్రాం భగవాన్ దాస్ కృపలానీ ప్రార్ధన చేశారు. రాజ్యంగ సభ తాత్కాలిక చైర్మన్ గా డాక్టర్ సచ్చానందన్ సిన్హాను సభకు పరిచయం చేశారు.

రాజ్యాంగ నిర్మాణానికి బీజం

1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధిపతిగా నియమితులయ్యారు. దేశం కోసం శాశ్వత, వ్యవస్థీకృత రాజ్యాంగాన్ని రచించడమే డ్రాఫ్టింగ్ కమిటీ లక్ష్యం. ఈ కమిటీ భారత ప్రభుత్వ చట్టం - 1935 నీ క్షుణ్ణంగా చదివి దాని ఆధారంగా 141 రోజుల్లో మొదటి ముసాయిదాను రచించి నవంబరు 4న రాజ్యాంగ సభకి సమర్పించింది. గణతంత్ర దేశం, పార్లమెంటరీ రూపం, సమాఖ్య నిర్మాణం, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీ రాజ్యాంగ రచనను ప్రారంభించింది.

అసెంబ్లీ సెషన్ లు ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవి. సమావేశాలు, చర్చలు తరువాత భారత రాజ్యాంగం ఆఖరి ముసాయిదా కాపీ ఖరారయింది. 1950 జనవరి 24న తుది ప్రతి పై రాజ్యాంగ అసెంబ్లీ లోని సభ్యులు సంతకాలు చేశారు. రాజ్యాంగాన్ని చేతి రాతతో రాశారు. తొలుత ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే రాశారు. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్దదిగా గుర్తింపు పొందింది.

రాజ్యాంగం చేతిరాత కాపీలను పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో హీలియం నింపిన కేసుల్లో భద్రపరిచారు. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. ఆ సమయంలో రాజ్యాంగ సభ ఒక 166 రోజుల్లో 11 సెషన్లలో సమావేశమైంది. వాటిలో ఒక 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం పై చర్చలు జరిగాయి.రాజ్యాంగ సభ సభ్యులను కేబినెట్ మిషన్ సిఫారసు మేరకు ఎన్నుకొన్నారు. ప్రాంతీయ శాసనసభ సభ్యులను పరోక్ష ఎన్నికల ద్వారా ఎంపిక చేశారు. 292 మంది సభ్యులు ప్రాంతీయ శాసనసభల ద్వారా ఎన్నికయ్యారు. 93 మంది అప్పటి రాచరిక రాష్ట్రాలకు, నలుగురు సభ్యులు చీఫ్ కమిషనర్ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించారు. మొదట్లో రాజ్యాంగ సభ మొత్తం సభ్యత్వం 389. అయితే 1947 జూన్ 3 నాటి మౌంట్ బాటన్ ప్లాన్, దేశ విభజన ఫలితంగా పాకిస్థాన్ తమ కోసం ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు ప్రక్రియను చేపట్టింది. దీంతో కొన్ని ప్రాంతాల ప్రతినిధులు పాకిస్తాన్ రాజ్యంగా అసెంబ్లీలో చేరిపోయారు. దీంతో రాజ్యాంగ సభ సభ్యత్వాన్ని 299 కి కుదించారు. 1946 డిసెంబరు 13న నెహ్రూ రాజ్యాంగం లక్ష్యం, తీర్మానాలను ప్రతిపాదించారు. 1947 జనవరి 22న రాజ్యాంగ సభ నెహ్రూ ప్రతిపాదించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ చర్చించింది. మొత్తం 7,635 సవరణలు రాగా 2,473 సవరణలను తిరస్కరించింది. 1950 జనవరి 24 న రాజ్యాంగ సభ గౌరవ సభ్యులు మొత్తం 284 మంది రాజ్యాంగం పై ఆమోద ముద్ర వేస్తూ సంతకాలు చేశారు. జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగ సభ సెషన్ లు

  • మొదటి సెషన్: 1946 డిసెంబర్ 9 - 23
  • రెండో సెషన్: 1947 జనవరి 20 - 25
  • మూడో సెషన్: 1947 ఏప్రిల్, 28 - మే, 2
  • నాలుగో సెషన్: 1947 జూలై 14 - 31
  • అయిదో సెషన్: 1947ఆగస్టు14 - 30
  • ఆరో సెషన్: 1948 జనవరి 27
  • ఏడో సెషన్: 1948 నవంబర్, 4 - 1949 జనవరి, 8
  • ఎనిమిదో సెషన్: 1949,మే 16 - జూన్ 16
  • తొమ్మిదో సెషన్: 1949 జూలై,30 - సెప్టెంబర్, 18
  • పదో సెషన్: 1949 అక్టోబర్, 6 - 17
  • పదకొండో సెషన్: 1949 నవంబర్ 14 - 26

పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించింది. భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్ సభ, రాష్ట్రపతి అని అర్థం. ఆర్టికల్ 74 (1) ప్రకారం పాలనలో రాష్ట్రపతికి సలహా ఇచ్చేందుకు ప్రధానమంత్రి తో కూడిన మంత్రిమండలి ఉంటుంది. అయితే అసలైన కార్య నిర్వాహక అధికారాలను ప్రధానమంత్రి, మంత్రి మండలికి రాజ్యాంగం కల్పించింది.

భారత రాజ్యాంగం ప్రస్తుతం 25 భాగాలలో సుమారు 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, ఐదు అనుబంధాలు, 123 సవరణ బిల్లులు, 101 సవరణ కలిగి ఉంది. వాస్తవానికి రాజ్యాంగాన్ని రాసినప్పుడు కేవలం 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 101 సార్లు సవరించారు. రాజ్యాంగ సవరణ, చట్టాల రూపకల్పన అధికారం పార్లమెంట్ కి ఉంటుంది.

బాగ్ ఆఫ్ బారోయింగ్స్

భారత రాజ్యాంగాన్ని "బాగ్ ఆఫ్ బారోయింగ్స్" అని పేర్కొంటారు. రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఇతర దేశాల రాజ్యాంగాలను శూన్యంగా పరిశీలించి మన దేశం, కాల, మాన పరిస్థితులకు అనువైన విషయాలను తీసుకున్నారు. దీనితో పాటు దేశ పాలన, ప్రభుత్వం, ప్రజలకు అనువైన విధానాలను వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి ప్రేరణగా తీసుకొన్నారు.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్-1935 నుంచి భారత రాజ్యాంగం లోకి తీసుకొన్న అంశాలు:-

సమాఖ్య, గవర్నర్ కార్యాలయం, న్యాయ వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర నిబంధనలు, అడ్మినిస్ట్రేటివ్ వివరాలు.

  • ఇంగ్లండ్:

పార్లమెంటరీ ప్రభుత్వం, ఏక పౌరసత్వం, శాసన విధానం, ద్విసభ విధానం (లోక్ సభ, రాజ్యసభ), క్యాబినెట్ విధానం, పార్లమెంటరీ అధికారాలు, ఎన్నికల కమిషన్.

  • సోవియట్ యూనియన్:

పంచవర్ష ప్రణాళిక విధానం, సాంఘిక న్యాయం, ప్రాథమిక విధులు

  • అమెరికా:

ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం ప్రవేశిక, దేశాధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అభిశంసన, సుప్రీంకోర్టు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష.

  • జపాన్:

సుప్రీంకోర్టు పనితీరు, చట్టాలు.

  • కెనడా:

కేంద్ర - రాష్ట్ర జాబితా, కేంద్రం రాష్ట్ర గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు సలహా, అధికార పరిధి.

  • ఆస్ట్రేలియా:

సమకాలిక జాబితా, స్వేచ్ఛ పూర్వక వాణిజ్యం, పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం.

  • ఫ్రాన్స్:

స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం.

  • జర్మనీ:

అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు.

  • దక్షిణాఫ్రికా:

పంచాయతీరాజ్ వ్యవస్థ, రాజ్యంగా సవరణకు సంబంధించిన ప్రక్రియ.

మినీ రాజ్యాంగం

1975-77 లో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేపట్టింది. దానిని 1976 నవంబరులో చేసింది. ఆ సవరణను అధికారికంగా 42వ రాజ్యాంగం సవరణ అని పిలుస్తారు. ఇందులోని పలు నిబంధనలు 1977 జనవరి 3న అమలులోకి వచ్చాయి. 42 వ రాజ్యాంగ సవరణ ను భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద రాజ్యాంగ సవరణ గా పరిగణిస్తారు. ఈ సవరణ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. భారత రాజ్యాంగం చరిత్రలో 42వ సవరణ విస్తృతమైన మార్పులను తీసుకొచ్చినందున దీన్ని "మినీ రాజ్యాంగం" లేదా "ఇందిరా రాజ్యాంగం" అని పిలుస్తారు.
స్వాతంత్ర్యం తర్వాత అతి పెద్ద పన్ను సంస్కరణల జీ ఎస్ టి ని ప్రవేశపెట్టారు. దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జి ఎస్ టి) అమలు కోసం 101 వ రాజ్యాంగ సవరణ చేశారు.

12 షెడ్యూళ్ళు - ముఖ్యాంశాలు

  • మొదటి షెడ్యూల్:
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భూభాగాల సరిహద్దు ప్రాదేశిక.
  • రెండో షెడ్యూల్:
దేశాధ్యక్షుడు, గవర్నర్ల నియమాలు.
  • మూడో షెడ్యూల్:
అంగికారాలు, ప్రమాణాలు.
  • నాలుగో షెడ్యూల్:
రాజ్యసభలో సీట్ల కేటాయింపు ప్రామాణికాలు.
  • అయిదో షెడ్యూల్:
షెడ్యూల్డ్ ప్రాంతాల నిర్వహణ, నియంత్రణ.
  • ఆరో షెడ్యూల్:
ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాల నిర్వహణ.
  • ఏడో షెడ్యూల్:
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధి.
  • ఎనిమిదో షెడ్యూల్:
దేశ భాషల గుర్తింపు.
  • తొమ్మిదో షెడ్యూల్:
న్యాయ సమీక్ష.
  • పదో షెడ్యూల్:
పార్టీ ఫిరాయింపుల తో పొందే ఆనర్హత.
  • పదకొండో షెడ్యూల్:
పంచాయతీలకు కేటాయింపులు.
  • పన్నెండో షెడ్యూల్:
మున్సిపాలిటీలకు కేటాయింపులు.

రాజ్యాంగ కమిటీలు

కమిటీ చైర్మన్
యూనియన్ పర్సన్ కమిటీ పండిత్ జవహర్ లాల్ నెహ్రు
యూనియన్ రాజ్యాంగం కమిటీ పండిట్ జవహర్ లాల్ నెహ్రు
స్టేట్స్ కమిటీ పండిట్ జవహర్ లాల్ నెహ్రు
డ్రాఫ్టింగ్ కమిటీ బి.ఆర్. అంబేద్కర్
విధాన నియమాల కమిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్
స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్
ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్
నేషనల్ ఫ్లాగ్ కమిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్
ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్స్ కమిటీ వల్లభాయ్ పటేల్
క్రేడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
హౌస్ కమిటీ బి. పట్టాభి సీతారామయ్య
ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కె.ఎం.మున్షీ
ఫండమెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయేంట్ అసెంబ్లీ కమిటీ జి.వి. మౌళాంకర్
ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఆచార్య జె.బి.కృపలానీ
మైనారిటీస్ సబ్ కమిటీ హెచ్.సి. ముఖర్జీ
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్స్ ఏరియా, పార్షియల్లి ఎక్స్యుడ్ ఏరియా కమిటీ గోపీనాథ్ బార్డోలి
మినహాయింపు, పాక్షికంగా మినహాయింపు ప్రాంతాల (అస్సాం లో కాకుండా) ఉప కమిటీ ఎ. వి. ఠక్కర్


భాగం ఆర్టికల్ ఆంశాలు
భాగం I 1-4 దేశ భూభాగం
భాగం II 5-11 పౌరసత్వం
భాగం III 12-35 ప్రాథమిక హక్కులు
భాగం IV 36-51 రాష్ట్రాల విధానం,సూత్రాలు
భాగం IV-ఎ 51-ఎ ప్రాథమిక విధులు
భాగం V 52-151 కేంద్ర ప్రభుత్వం
భాగం VI 152-237 రాష్ట్ర ప్రభుత్వం
భాగం VII 238 రాష్ట్రాలు
భాగం VIII 239-242 కేంద్రపాలిత ప్రాంతాలు
భాగం IX 243-243ఓ పంచాయతీలు
భాగం IX-ఎ 243 పి-243 జెడ్ జి మున్సిపాలిటీలు
భాగం X 244-244ఎ షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాలు
భాగం XI 245-263 కేంద్ర - రాష్ట్ర సంబంధాలు
భాగం XII 264-300 ఎ ఫైనాన్స్, ఆస్తి, కాంట్రాక్ట్, వ్యాజ్యాలు
భాగం XIII 301-307 వ్యాపారం, వాణిజ్యం
భాగం XIV 308-323 కేంద్రం, రాష్ట్రాల కింద సేవలు
భాగం XIV-ఎ 323ఎ- 323బి న్యాయస్థానాలు
భాగం XV 324-329ఎ ఎన్నికలు
భాగం XVI 330-342 నిర్దిష్ట తరగతులకు సంబంధించిన ప్రత్యేక నింబందనలు
భాగం XVII 343-351 అధికారిక భాష
భాగం XVIII 352-360 అత్యవసర కేటాయింపులు
భాగం XIX 361-367 ఇతరాలు
భాగం XX 368 రాజ్యాంగ సవరణ
భాగం XXI 369-392 తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేక నియమాలు
భాగం XXII 393-395 అధికారిక వచనం




English Translation



The Government of India has announced November 26, 2015 as the Kingdom Day. Since then the Constitution Day has been held annually. On November 26, 1949, the Constitution of India was ratified. The government has taken this decision with the intention of educating every citizen of the country on the constitution.

Government of India Act 1935

India gained independence on August 15, 1947. The country was ruled under the British Government of India Act 1935 from January 26, 1950, due to lack of a constitution. The law was enacted in February 1935. However, the approval of the British monarchy came into force in July 1935.

First meeting of the Constituent Assembly

The Constituent Assembly met for the first time on 9 December 1946 in the Constitution Hall in New Delhi. The Constitutional Hall of the present day is the Central Hall of Parliament. Celebrities like Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Dr Rajendra Prasad, Dr B.R. Ambedkar, Acharya Kriplani, Maulana Abul Kalam Azad, Mrs. Sarojini Naidu, Hare Krishna Mehtab, Pandit Govind vallab panth, Sharath Chandrabhos, Rajagopalachari and M. Asaf Ali participated. 207 delegates, including nine women, attended the meeting.
Acharya Jeevatram Bhagwan Das Kripalani prayed, "Lord, we are trying to create a constitution for our country. Dr. Sachchanandan Sinha was introduced to the House as interim chairman of the Rajya Sabha.

Germ for constitution

On August 29, 1947, Dr. BR Ambedkar was appointed as the head of the Constitutional Drafting Committee. The purpose of the Drafting Committee is to create a permanent, organized constitution for the country. The committee read the Government of India Act 1935 thoroughly and drafted the first draft in 141 days and submitted it to the Constituent Assembly on November 4. The committee initiated the writing of the Constitution with a view to the republican state, parliamentary structure, federal structure, fundamental rights and independent judicial system.

Assembly sessions are also available to the public. The final draft copy of the Constitution of India was finalized after the meetings and debates. On January 24, 1950, the final draft was signed by members of the Constituent Assembly. The constitution was written by hand. Originally written only in English and Hindi. Our Constitution, which came into force on January 26, 1950, is the largest in the world.

The handwritten copies of the Constitution were preserved in helium-filled cases in the Parliament House Library. The constitutional writing took two years and 11 months and 17 days. At that time the Constituent Assembly convened in 11 sessions in one 166 days. One of them discussed the draft constitution for 114 days. Members of the Rajya Sabha were elected on the recommendation of the Cabinet Mission. The members of the provincial legislature were elected by indirect election. 292 members were elected by provincial legislatures. Of the 93 princely states, four members represented the Chief Commissioner area. Initially the total membership of the Constituent Assembly was 389. However, as a result of the partition of the country, the Mountbatten Plan of June 3, 1947, Pakistan embarked on its own constitution. Representatives from some areas have joined the Assembly as the Kingdom of Pakistan. This reduced the membership of the Constituent Assembly to 299. On December 13, 1946, the Nehru Constitution proposed and resolved. On January 22, 1947, the Constituent Assembly unanimously approved the resolutions proposed by Nehru. The Constituent Assembly discussed the draft constitution. A total of 7,635 amendments were received and 2,473 were rejected. On January 24, 1950, a total of 284 members of the Constituent Assembly signed a ratification of the Constitution. The Constitution of India came into force from January 26.

Constituent Assembly Sessions

  • first session: December 9, 1946 - 23
  • Second Session: January 20, 1947 - 25
  • Third Session: April 28, 1947 - May, 2
  • Fourth Session: July 14, 1947 - 31
  • 5th Session: August 14, 1947 - 30
  • 6th Session: January 27, 1948
  • Seventh Session: November 1948, 4 - January 1949, 8
  • Eighth Session: 1949, May 16 - June 16
  • Ninth Session: July 30, 1949 - September 18, 18
  • tenth Session: October 1949, 6 - 17
  • Eleventh Session: November 14, 1949 - 26
India has become a sovereign, socialist, secular, democratic and republican state with a parliamentary system. The Constitution of India reflects the form of parliamentary government. Article 79 means the Parliament, the Rajya Sabha, the Lok Sabha and the President. Article 74 (1) includes a Cabinet of Ministers with the Prime Minister to advise the President on the rule. However, the Constitution gives the Prime Minister and the Council of Ministers the powers of the Executive.

The Constitution of India currently contains 25 parts, approximately 448 articles, 12 schedules, five appendices, 123 amendment bills and 101 amendments. In fact when the Constitution was written there were only 395 articles, 22 parts and 8 schedules. The constitution has been revised 101 times so far. The constitutional amendment and the drafting of laws are vested in Parliament.

Bag of Barrowings

The Constitution of India is referred to as the "Bag of Barrowings". When drafting the Constitution, the Constitution of other countries was taken into account in a way that suited our country, time and human situation. In addition, the policies of the country's governance, government and people were drawn from the constitutions of various countries.

Articles taken from the Government of India Act-1935 into the Constitution of India: -

Federal, Governor's Office, Judicial System, Public Service Commission, Emergency Regulations, Administrative Details.

  • England:

Parliamentary Government, Single Citizenship, Legislative Policy, Bipartisan Policy (Lok Sabha, Rajya Sabha), Cabinet Policy, Parliamentary Powers, Electoral Commission.

  • Soviet Union:

Five Year Plan, Social Justice, Fundamental Functions

  • United States:

Fundamental rights, Constitution entry, President, Vice President, Presidential indictment, Supreme Court, independent judiciary, judicial review.

  • Japan:

Supreme Court Performance and Laws.

  • Canada :

Central - State List, Center Appointment of State Governors, Supreme Court Advisory, Jurisdiction.

  • Australia:

Concurrent List, Free Trade, Joint Meeting of the Houses of Parliament.

  • France:

Freedom, Equality, Fraternity.

  • Germany:

Termination of Fundamental Rights in Emergency.

  • South Africa:

The Panchayatiraj system is a process of amendment to the state.

Mini Constitution

Emergency was imposed on the country in 1975-77. The Indian National Congress government headed by Prime Minister Indira Gandhi has amended the constitution in case of emergency. That was done in November 1976. That amendment is officially known as the 42nd Constitution Amendment. Many of these provisions came into effect on January 3, 1977. The 42nd Amendment is considered the most controversial constitutional amendment in the history of India. Through this amendment the Supreme Court and the High Courts have tried to reduce the power. It is called "Mini Constitution" or "Indira Constitution" as the 42nd Amendment has brought about drastic changes in the history of the Indian Constitution.
The biggest tax reform GST was introduced after independence. 101st Amendment to the Implementation of Goods and Services Tax (GST) in the country.

12 Schedules - Highlights

  • First Schedule:
The territorial boundary of the states and Union Territories.
  • Second Schedule:
President's and Governors Rules.
  • Third Schedule:
  • Fourth Schedule:
Seat Allocation Standards in the Rajya Sabha.
  • Fifth Schedule:
Scheduled Areas Management and Control.
  • Sixth Schedule:
Management of Northeastern states and tribal areas.
  • Seventh Schedule:
  • Eighth Schedule:
Identification of country languages.
  • Ninth Schedule:
Legal Review.
  • Tenth Schedule:
Enjoyment with party defects.
  • Eleventh Schedule:
Provisions for Panchayats.
  • Twelfth Schedule:
Provisions for Municipalities.

Constitutional Committees

committee Chairman
Union Personnel Committee Pandit Jawaharlal Nehru
Union Constitution Committee Pandit Jawaharlal Nehru
States Committee Pandit Jawaharlal Nehru
Drafting Committee BR. Ambedkar
Policy Rules Committee Dr. Rajendra Prasad
Steering Committee Dr. Rajendra Prasad
Finance and Staff Committee Dr. Rajendra Prasad
National Flag Committee Dr. Rajendra Prasad
Fundamental Rights, Minorities, Tribals Committee Vallabhbhai Patel
Credential Committee Alladi Krishnaswamy Iyer
House Committee B. Pattabhi Sitaramaiah
Order of Business Committee K.M. Munsi
Fundamental Functions of the Constitutional Assembly Committee G.V. Maulankar
Fundamental Rights Subcommittee Acharya J.B. Kripalani
Minorities Subcommittee H.C. Mukherjee
North East Frontier Tribals Area, Partially Excluded Area Committee Gopinath Bardoli
Subcommittee on Exclusion, Partially Excluded Areas (not in Assam) A.V. Thakkar


the Article ansalu
Part I 1-4 Country Territory
Part II 5-11 Citizenship
Part III 12-35 Basic Rights
Part IV 36-51 States Policy and Principles
Part IV- A 51- A Basic Functions
Part V 52-151 Central Government
Part VI 152-237 State Government
Part VII 238 the
Part VIII 239-242 Union Territories
Part IX 243-243 O panchayats
Part IX-A 243P-243ZG municipalities
Part X 244-244A Scheduled, Tribal Areas
Part XI 245-263 Central - State Relations
Part XII 264-300A finance, property, contract, lawsuits
Part XIII 301-307 Business, Trade
Part XIV 308-323 Services under the Center and States
Part XIV-A 323a- 323b courts
Part XV 324-329A polls
Part XVI 330-342 Specific rules for specific classes
Part XVII 343-351 Official Language
Part XVIII 352-360 Emergency Provisions
Part XIX 361-367 other
Part XX 368 Constitution Amendment
Part XXI 369-392 Temporary, Transitional, Special Rules
Part XXII 393-395 Official text

Comments

Post a Comment

Please do not enter any spam link in the comment box