క్రీడలు
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్
మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఐదోసారి ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ ను సాధించాడు. మెక్సికన్ గ్రాండ్ ప్రిలో నాలుగో స్థానం లో నిలిచిన లూయిస్ మరో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ చాంపియన్ గా అవతరించాడు. ఈ టైటిల్ ను ఐదుసార్లు గెలిచిన జువాన్ మాన్యుయెల్ ఫాంగియో సరసన హామిల్టన్ నిలిచాడు. షూమాకర్ మాత్రమే ఏడు సార్లు టైటిల్ గెలిచి వీరికంటే ముందున్నాడు. ఇంతకు ముందు 2008, 2014, 2015, 2017 లో ఎఫ్ 1 చాంపియన్ గా నిలిచాడు.
భారతీయ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తన తొలి విడత గస్తీని పూర్తి చేసుకుంది. ఈ జలాంతర్గామి నుంచి అణ్వాయుధాలను ప్రయోగించవచ్చ. దక్షిణాసియాలో మొదటిసారిగా అణు జలాంతర్గామిని సముద్రంలో మోహరించడం పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అరిహంత్ మోసుకెళ్లే అణ్వాయుధాలు కె -15 రకానికి చెందినవి. ఇది 1000 కి. మీ. ల లక్ష్యాన్ని ఛేదించగలదు. బంగాళాఖాతం మధ్య నుంచి చుస్తే ఇస్లామాబాద్ 2500 కి. మీ., బీజింగ్, షాంఘై 4000 కి. మీ. దూరంలో ఉంటాయి. తొలి గస్తీ పూర్తి చేసిన నౌకాదళ సిబ్బందికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారత మొదటి మైక్రో ప్రాసెసర్ శక్తిని చెన్నై ఐఐటి కి చెందిన శాస్త్ర వేత్తలు తయారు చేశారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి మైక్రో ప్రాసెసర్. దీనికి "శక్తి" అని పేరు పెట్టారు. దీని అభివృద్ధితో మైక్రోచిప్ ల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. సైబర్ దాడులను దీటుగా ఎదుర్కోవచ్చు. ఈ "shakti" ప్రాసెసర్ ను చండీగఢ్ లోని ఇస్రో కు చెందిన సెమి కండక్టర్ లేబొరేటరీ లో అభివృద్ధి చేశారు.
సులభతర వాణిజ్యంలో భారత్ ఏకంగా 23స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంక్ అక్టోబరు 31న ఢిల్లీ లో "డూయింగ్ బిజినెస్ - 2019" వేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని పరిస్థితులను అంచనా వేసి ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ నివేదికలో భారత్ 77వ స్థానంలో నిలిచింది. 2014 లో 142 వైస్ స్థానంలో ఉన్న భారత్ 2016 లో 130, 2017 లో 100, 2018 లో 77 వ స్థానానికి చేరుకుంది. ర్యాంకులపరంగా 2014 లో దక్షిణాషియా దేశాల్లో ఆరో స్థానంలో ఉన్న భారత్ 2018 లో ఒకటో స్థానానికి చేరింది.
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ టి యు ) కి భరత్ తిరిగి ఎన్నికైంది. 2019 నుంచి 2022 వరకు భరత్ సభ్యదేశంగా ఉంటుంది . దుబాయి లో జరిగిన ఐ టి యు సదస్సులో జరిగిన ఎన్నికలో భరత్ తిరిగి ఎన్నికైంది . భరత్ మళ్ళీ ఐ టి యు కి ఎన్నికైనట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా నవంబర్ 6 న ప్రకటించారు. ఐ టి యు కి 193 సభ్యదేశాలు ఉన్నాయి. ఎన్నికలో భారత్ కు 165 ఓట్లు లభించాయి .

ఆసియా స్నూకర్ విజేత పంకజ్
పంకజ్ అడ్వాణీ ఆసియా స్నూకర్ విజేతగా నిలిచాడు. చైనా కు చెందిన జు రేతిని ఓడించాడు. ఈ విజయంతో పంకజ్ ఆసియా స్నూకర్ టూర్ ఈవెంట్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు.జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ అరుదైన ఘనత
అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ అరుదైన ఘనత సాధించింది. దోహో లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్ షిప్ వ్యక్తిగత వాల్ట్ విభాగంలో స్వర్ణం నెగ్గిన బైల్స్ ప్రపంచ చాంపియన్ షిప్ లో 13పసిడి పతకాలు నెగ్గిన తొలి జిమ్నాస్ట్ గా చరిత్ర సృష్టించింది. బెలారస్ కు చెందిన పురుష జిమ్నాస్ట్ విటలీచేర్చొ(12) పేరిట ఉన్న అల్ టైం రికార్డును ఆమె తిరగ రాసింది.ఆసియా హాకీ కప్ సంయుక్త విజేతలు భారత్ - పాక్
వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ సంయుక్త విజేతలుగా భారత్, పాక్ లను ప్రకటించారు. 2011 లో ఈ టోర్నీని ప్రారంభించగా భారత్ 2011, 2016 లో విజేతగా నిలువగా, 2012, 2013 లో పాక్ విజేతగా నిలిచింది. భారత్, మలేషియా, పాకిస్తాన్, దక్షిణ కొరియా, జపాన్ జట్లు ఈ సారి టైటిల్ కోసం పోటీపడ్డాయి.కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
భారత ఆటగాడు సౌరభ్ కొఠారి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు. అక్టోబర్ 26 న లీడ్స్ లో జరిగిన ఫైనల్లో కొఠారి 1134 - 944 తేడాతో సింగపూర్ కి చెందిన పీటర్ గిల్ క్రిస్ట్ ను ఓడించి టైటిల్ సాధించాడు. కొఠారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ షిప్ ను కూడా గెలుచుకున్నాడు.ఐ సి సి హాల్ ఆఫ్ ఫేమ్ లో ద్రవిడ్
భారత దిగ్గజ బ్యాట్సమన్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఐ సి సి హాల్ ఆఫ్ లో అతడి పేరు చేర్చారు. భారత్ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఐదో ఆటగాడు ద్రవిడ్. అతడి కంటే ముందు బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, అనిల్ కుంబ్లే ఉన్నారు.ఐసిసి ర్యాంకింగ్స్ లో కోహ్లీ, బుమ్రాలకు అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ సంఘం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రీడాకారులు విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రాలకు అగ్రస్థానం దక్కింది. నవంబరు 12న ఐసిసివిడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లీ 899 పాయింట్లతో నంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. మరో వైపు బౌలింగ్ విభాగం లో జస్ ప్రీత్ బుమ్రా 841 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు.బ్యాట్స్ మెన్ జాబితాలో భారత్ నించి రోహిత్ శర్మ కు రెండు, ధావన్ కు ఎనిమిదవ స్థానం లభించింది. బౌలర్ల విభాగంలో కులదీప్ మూడవ స్థానం, చాహాల్ అయిదో స్థానంలో నిలిచారు. టీమ్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు 121 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా, ఇంగ్లాండ్ జట్టు 126పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఉత్తమ అల్ రౌండర్ గా నిలిచాడు. బ్యాటింగ్ విభాగంలో టెస్టు ర్యాంకింగ్స్ లో కూడా విరాట్ కోహ్లీ అగ్రస్థానం లో ఉన్నాడు.బ్లిడ్జ్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
భారత్ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ "టాటా స్టీల్ చెస్ బ్లీడ్జ్" టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. 18 రౌండ్లు ముగిసే సరికి అమెరికా ఆటగాడు నకముర, ఆనంద్ సమంగా ఉండడంతో ఆట ప్లేఆఫ్ కు వెళ్ళింది. అందులో ఆనంద్ 1.5-0.5 తేడాతో నకముర ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. హరికృష్ణ 7.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో నకముర విజేతగా నిలవగా, హరికృష్ణ రెండు, ఆనంద్ ఏడో స్థానంలో నిలిచారు.రెజ్లింగ్ లో బజరంగ్ నం. 1
భారత స్టార్ బజరంగ్ పూనియా ప్రపంచ ర్యాంకింగ్ లో మొదటి స్థానానికి చేరుకున్నాడు తాజాగా విడుదల చేసిన ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకుల్లో 65 కేజీల విభాగంలో బజరంగ్ 96 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల ప్రపంచ చాంపియన్ షిప్ లో రజత పతకం గెలవడం తో ర్యాంకింగ్ లో పూనియా అగ్రస్థానం దక్కింది. బజరంగ్ పూనియా తన కెరీర్ లో తొలిసారి ప్రపంచ నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు.యునిసెఫ్ ఇండియా యువ రాయబారి హిమదాస్
భారత యువ అథ్లెట్ హిమదాస్ యునిసెఫ్ ఇండియా తొలి యువ రాయబారిగా నియమితులయ్యారు. హిమదాస్ 2018 ఆసియా క్రీడల్లో 4*400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించింది. అసోంలోని నాగోన్ జిల్లా దింగ్ పట్టణానికి సమీపంలోని కందులమారి గ్రామంలో హిమదాస్ 2000లో జన్మించింది. 2018 జులై లో ఫిన్ లాండ్ లో జరిగిన అండర్ -20 చాంపియన్ షిప్ లో హిమదాస్ 400 మీటర్ల విభాగం లో బంగారు పతాకాన్ని గెలుచుకుంది.ప్రపంచ జిమ్నాస్టిక్ లో బైల్స్ కు ఆరు పతకాలు
అమెరికా అథ్లెట్ సిమోన్ బైల్స్ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్ లో పోటీ పడిన ఆరు విభాగాల్లో ఆరు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పింది. ఇందులో నాలుగు స్వర్ణాలు ఉన్నాయి . 1987 లో రష్యా క్రీడాకారిణి ఎలీనా షుషునోవా తర్వాత ఆరు విభాగాల్లో ఆరు పతకాలను బైల్స్ గెలుచుకుంది. 21 ఏళ్ల ఈ క్రీడాకారిణి టీమ్ విభాగం, ఆల్ రౌండ్ , వాల్ట్ , ఫ్లోర్ ఎక్సర్ సైజ్ లో పసిడి పతకాలు, ఆన్ ఈవెన్ బార్స్ లో రజతం, బీమ్ లో కాంస్య పతాకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ షిప్ లో మొత్తం మీద 14 స్వర్ణాలు బైల్స్ గెలుచుకుంది.పురస్కారాలు
జూపాక సుభద్రకు "కాళోజి"
సైన్స్ అండ్ టెక్నాలజీ
ముగిసిన కెప్లర్ టెలిస్కోప్ శకం
దాదాపు పదేళ్ళపాటు అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగించిన కెప్లర్ టెలిస్కోప్ సేవలకు ముగింపు పలకాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్ణయించింది. కెప్లర్ దశాబ్దం సౌరకుటుంబం వెలుపల, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పసిగట్టింది. విశ్వం లో మరిన్ని పరిశీలనలు సాగించేందుకు అవసరమైన ఇంధనం ఇందులో లేకపోవడంతో దీని సేవలను నాసా నిలిపివేసింది. కెప్లర్ తన ప్రస్థానంలో 2600కు పైగా ఎక్సోప్లానెట్స్ ను గుర్తించింది. రాత్రి పూట మనకు కనిపించే నక్షత్రాల్లో 20 నుంచి 50 శాతం మేర తారల చుట్టూ సమశీతోష్ణ ప్రాంతంలో భూమి పరిమాణంలోని గ్రహాలు ఉన్నాయని వెల్లడించింది. వాటి పై ద్రవరూపంలో నీరుండటానికి అవకాశం ఉందని పేర్కొంది. కెప్లర్ టెలిస్కోప్ ను 2009 మార్చి 6న నాసా ప్రయోగించింది. సిగ్నస్ తారా మండలం లో 15 లక్షల నక్షత్రాలను నిరంతరంగా పరిశీలించి, వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పసిగట్టడం దీని ముఖ్య ఉద్దేశం.
సూపర్ సోనిక్ పారాచూట్ ఆవిష్కరణ
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అద్భుత సూపర్ సోనిక్ పారాచూట్ బు ఆవిష్కరించింది. కేవలం 0.4 సెకన్ వ్యవధిలో విచ్చుకొని, 37 వేల కిలోల బరువును విజయవంతంగా మోయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది. నాసా 2020 లో అంగారకుడి పైకి ప్రయోగించనున్న రోవర్ సిరక్షితంగా కిందకు దిగడంలో ఈ పారాచూట్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. నైలాన్, టెక్నోరా, కేవ్లార్, ఫైబర్ లతో దీనిని తయారు చేశారు. దీని బరువు 180 పౌండ్లు.
సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లిన వ్యోమనౌక
సూర్యుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లిన మానవ నిర్మిత యంత్రంగా పార్కర్ సోలార్ ప్రోబ్ చరిత్ర సృష్టించింది. 1976 లో భానుడి ఉపరితలం నుంచి 25.66 మిలియన్ల మైళ్ళ దూరానికి జర్మనీ - అమెరికా వ్యోమనౌక హీలియోస్-2 వెళ్ళింది. ఈ రికార్డును పార్కర్ అధిగమించింది.
అరిహంత్ తొలి గస్తీ పూర్తి
భారతీయ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తన తొలి విడత గస్తీని పూర్తి చేసుకుంది. ఈ జలాంతర్గామి నుంచి అణ్వాయుధాలను ప్రయోగించవచ్చ. దక్షిణాసియాలో మొదటిసారిగా అణు జలాంతర్గామిని సముద్రంలో మోహరించడం పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అరిహంత్ మోసుకెళ్లే అణ్వాయుధాలు కె -15 రకానికి చెందినవి. ఇది 1000 కి. మీ. ల లక్ష్యాన్ని ఛేదించగలదు. బంగాళాఖాతం మధ్య నుంచి చుస్తే ఇస్లామాబాద్ 2500 కి. మీ., బీజింగ్, షాంఘై 4000 కి. మీ. దూరంలో ఉంటాయి. తొలి గస్తీ పూర్తి చేసిన నౌకాదళ సిబ్బందికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
తొలి మైక్రో ప్రాసెసర్ "శక్తి"
భారత మొదటి మైక్రో ప్రాసెసర్ శక్తిని చెన్నై ఐఐటి కి చెందిన శాస్త్ర వేత్తలు తయారు చేశారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి మైక్రో ప్రాసెసర్. దీనికి "శక్తి" అని పేరు పెట్టారు. దీని అభివృద్ధితో మైక్రోచిప్ ల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. సైబర్ దాడులను దీటుగా ఎదుర్కోవచ్చు. ఈ "shakti" ప్రాసెసర్ ను చండీగఢ్ లోని ఇస్రో కు చెందిన సెమి కండక్టర్ లేబొరేటరీ లో అభివృద్ధి చేశారు.
రాష్ట్రీయం
విద్యుత్ వినియోగంలో తెలంగాణకు ప్రథమ స్థానం
విద్యుత్ వినియోగ వృద్ధి రేటులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్రీయ విద్యుత్ మండలి 2016-17 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2016-17 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1551 యూనిట్లు ఉండగా, 2017-18 లో 11.34% వృద్ధి రేటుతో 1727 యూనిట్లకు చేరింది. ఇదే కాలంలో జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 2.4 శాతం మేర మాత్రమే వృద్ధి చెందింది. జాతీయ స్థాయిలో తలసరి విద్యుత్ వినియోగం 1122 యూనిట్ల నుంచి 1149 యూనిట్లకు పెరిగింది.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు.
జాతీయం
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం
భారత దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ అక్టోబరు 31న నర్మదా నది తీరంలో ఆవిష్కరించారు. గుజరాత్ లోని నర్మదా తీరాన కెవడియా వద్ద 182 మీటర్ల ఎత్తు గల పటేల్ విగ్రహాన్ని నిర్మించారు. పటేల్ 143 వ జయంతిని పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తున ఇది ప్రపంచం లోనే ఎత్తయిన విగ్రహం. ప్రముఖ శిల్ఫి రామ్ వంజి సుతార్ ఈ విగ్రహ నిర్మాణం లో కీలక పాత్ర పోషించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న శక్తుల నుంచి దేశాన్ని కాపాడి చిన్న చిన్న సంస్థానాలన్నింటిని విలీనం చేసి పటేల్ ఐక్య భారత దేశాన్ని నిర్మించారు. దీనికి గుర్తుగా ఈ విగ్రహానికి ఐక్యత విగ్రహం అని పేరు పెట్టారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2989కోట్లు ఖర్చు చేసింది. ఈ విగ్రహానికి అవసరమైన ఇనుమును రైతులు స్వచ్ఛందంగా సమకూర్చారు. విగ్రహం కింది భాగం లో మ్యూజియం ఏర్పాటు చేశారు.సులభతర వాణిజ్యంలో భారత్ కు 77వ ర్యాంక్
సులభతర వాణిజ్యంలో భారత్ ఏకంగా 23స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంక్ అక్టోబరు 31న ఢిల్లీ లో "డూయింగ్ బిజినెస్ - 2019" వేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని పరిస్థితులను అంచనా వేసి ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ నివేదికలో భారత్ 77వ స్థానంలో నిలిచింది. 2014 లో 142 వైస్ స్థానంలో ఉన్న భారత్ 2016 లో 130, 2017 లో 100, 2018 లో 77 వ స్థానానికి చేరుకుంది. ర్యాంకులపరంగా 2014 లో దక్షిణాషియా దేశాల్లో ఆరో స్థానంలో ఉన్న భారత్ 2018 లో ఒకటో స్థానానికి చేరింది.
అంతర్జాతీయం
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా జయీర్ బొల్సోనరో
లాటిన్ అమెరికా దేశమైన బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా జయీర్ బొల్సోనరో ఎన్నికయ్యారు. మాజీ సైనికుడైన జయీర్ ను ప్రజలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇజ్రాయెల్ లోని తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలేం కు మారుస్తున్నట్లు అధ్యక్షుడిగా ఎన్నికైన జయీర్ ప్రకటించారు. అమెరికా, గ్యాటెమాలా తర్వాత తమ ఎంబసీని జెరూసలేం కు మార్చుతున్న మూడోదేశం బ్రెజిల్. 2019 జనవరి 1 నుంచి బొల్సోనరో బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. సైన్యంలో పనిచేసిన జయీర్ గతంలో రియో డి జెనీరో కౌన్సిలర్ గా పనిచేసారు.
ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని టర్కీలోని ఇస్తాంబుల్ లో నిర్మించారు. అక్టోబరు 29 న ఇది అందుబాటులోకి వచ్చింది. టర్కీ గణతంత్ర దేశంగా అవతరించి 95 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్ధోగన్ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు అట్లాంటాలో హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ విమానాశ్రయం ప్రపంచంలో అతి పెద్దదిగా ఉంది. ఆ స్థానాన్ని ఇస్తాంబుల్ విమానాశ్రయం ఆక్రమించింది.
టోక్యోలో భారత్ - జపాన్ భాగస్వామ్య సదస్సు
భారత్ - జపాన్ 13వ భాగస్వామ్య సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీ జపాన్ ను సందర్శించారు. అక్టోబరు 29 న టోక్యోలో జరిగిన ఈ సదస్సులో ఇరుదేశ ప్రధానులు మోదీ, షింజో అబే ఆరు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. హైస్పీడు రైలు ప్రాజెక్టు, నౌకాదళ సహకారం విషయం లో విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ మంత్రుల మధ్య 2+2 సమావేశాలు జరిగాయి. క్యాపిటల్ మార్కెట్లలో స్థిరత్వం కోసం స్థానిక కరెన్సీలో 7500 కోట్ల డాలర్ల వరకు చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించే భారీ ఒప్పందం పై, యోగా, ఆయుర్వేదంలో సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందాల పై సంతకాలు చేశాయి.
ఐటియు కు తిరిగి ఎన్నికైన భారత్
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ టి యు ) కి భరత్ తిరిగి ఎన్నికైంది. 2019 నుంచి 2022 వరకు భరత్ సభ్యదేశంగా ఉంటుంది . దుబాయి లో జరిగిన ఐ టి యు సదస్సులో జరిగిన ఎన్నికలో భరత్ తిరిగి ఎన్నికైంది . భరత్ మళ్ళీ ఐ టి యు కి ఎన్నికైనట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా నవంబర్ 6 న ప్రకటించారు. ఐ టి యు కి 193 సభ్యదేశాలు ఉన్నాయి. ఎన్నికలో భారత్ కు 165 ఓట్లు లభించాయి .
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box