మన మెదడే మన కంప్యూటర్


మానవ శరీరంలో అతిముఖ్యమైన భాగం మెదడు. అంతే కాదు సంక్లిష్టమైన భాగం కూడా. ఆలోచించే శక్తి, విశ్లేషించే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, కొత్త కోత్త  విషయాలను నేర్చుకోవడం వంటివి అన్ని మెదడుతో ముడిపడినవే. చెప్పాలంటే మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్.

🔶 మానవ మెదడు 1350 గ్రాముల బరువు ఉంటుంది. 22 ఎముకలతో నిర్మితమైన కపాలంలో మెదడు ఉంటుంది. మెదడు చుట్టూరా సెరిబ్రోసైనల్ మెదడులో అతి పెద్ద భాగం సెరెబ్రమ్. ఇది మెదడు బరువులో 85 శాతం ఉంటుంది. కార్పస్ కొల్లోజమ్, సెరిబ్రల్ కార్టెక్స్, థలామస్, సెరెబెల్లం, హైపోథలామస్ అనేవి మెదడులోని ఇతర ముఖ్యమైన భాగాలు.
     మెదడులోని కుడి, ఎడమ వైపు భాగాల్లో, కుడి వైపు భాగం, ఎడమ వైపు శరీరభాగాలను, ఎడమవైపు మెదడు భాగం కుడివైపు శరీర భాగాల పనితీరు నియంత్రిస్తుంది. మెదడులోని ఎడమ భాగం విశ్లేషణ,  కుడి భాగం సృజనాత్మకత ఆలోచనలు చేస్తుంది.

🔶మనం నిద్ర లేచినప్పుడు మెదడు 23 వాట్ల శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ శక్తితో ఒక బల్బును వెలిగించవచ్చు. గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తనాళాలు 20 నుంచి 25 శాతం రక్తాన్ని మెదడుకు చేరవేస్తాయి.

🔶శరీరంలో ఉత్పత్తి అయ్యే శక్తితో పాటు మనం పిల్చుకునే ఆక్సిజన్ 20 శాతం మెదడు తన అవసరాలకు వాడుకుంటుంది.

🔶మెదడుకు 8 నుంచి 10 సెకన్ల వరకు ఆక్సిజన్, రక్తసరఫరా ఆగిపోతే, మెదడు అపస్మారకస్థితిలోకి వెళుతుంది. అయిదు నిముషాలు మెదడుకు ఆక్సిజన్ అందకపోతే మెదడు చనిపోతుంది. దీన్నే బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అయిన  వ్యక్తి శరీర భాగాలను అవయవ లోపం ఉన్నవారికి అమర్చవచ్చు.  వారికి ప్రాణం పోయొచ్చు.

🔶మెదడులో వంద కోట్ల నాడీకణాలుంటాయి.తల్లి గర్భంలో ఉన్న శిశువులో నిమిషానికి రెండు లక్షల యాభై వేల నాడీకణాలు ఉత్పత్తి అవుతాయి. మెదడులోని రక్త నాళాలను నేలపై పరిస్తే, అవి లక్షయే అరవై వేల కిలోమీటర్ల మేర పొడవు ఉంటాయి.

🔶వయసు పెరిగే కొద్దీ మెదడు పని తీరు కూడా తగ్గిపోతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి నాడీకణాలను దెబ్బతీసే వ్యాధులు. బ్రెయిన్ స్ట్రోక్ మెదడులోని రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టడం వల్ల ఎక్కువగా వస్తుంది.

🔶మనం ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు మెదడుకు ఎక్కువ ఆక్సిజన్, శక్తి అవసమవుతుంది. యాభైశాతం రక్తాన్ని ఈ సమయంలో మెదడు వినియోగించుకుంటుంది.

🔶మన మెదడులో రోజుకు డెభ్భై వేల ఆలోచనలు పుడతాయి.

🔶మెదడు ఆరోగ్యాంగా ఉండాలంటే చేపలు, నట్స్, పళ్ళ గింజలు, ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా తినాలి.

Comments