ఒక శతాబ్దం కిందట భారత దేశం లోని పులుల జనాభా కనీసం లక్ష కన్నా ఎక్కువ. ఈ జంతువులు ఆరోగ్యకరమైన జీవావరణ వ్యవస్థ కు సూచికలు. అడవిలో ఆహార ప్రక్రియ పరిణామక్రమం లేదా ఫుడ్ చైన్ లో అన్నిటి కన్నా పైన ఉంటాయి. పర్యావరణ, ఆరోగ్యకరమైన అరణ్య నిర్మాణానికి ఇవి చిహ్నాలు. పులులను పరిరక్షించడం ద్వారా అరణ్యాలను తద్వారా పర్యావరణ వ్యవస్థను రక్షించవచ్చు. భారత ప్రభుత్వం కూడా పులుల రక్షణకు చర్యలు చెప్పెట్టింది
ప్రాజెక్ట్ టైగర్
- 1970 ల వరకు పులుల వేటకు వ్యతిరేకంగా భారత దేశం లో చట్టాలు లేవు. దింతో వివిధ కారణాల కోసం వేలల్లో వీటిని మట్టు పెట్టేవారు
- 1972లో క్షణించి పోయిన సంఖ్య దేశాన్ని కలవరు పెట్టింది.
- 1940లలో 40 వేల పులులు ఉండగా 1970 ప్రారంభం నాటికీ వీటి సంఖ్య 1800 కి చేరింది.
- పులి పరిరక్షణను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1973 "ప్రాజెక్ట్ టైగర్" ను ప్రారంభించింది.
- రాయల్ బెంగాల్ టైగర్ ను 1973 లో జాతీయ జంతువుగా ప్రకటించారు. ఈ విధంగా పులుల రక్షణ కోసం తొలి అడుగు పడింది. వీటిని రక్షించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని నాటి ప్రభుత్వం పిలుపునిచ్చింది.
- 1971లో పులులను వేటాడడం పై జాతీయ స్థాయిలో నిషేధం విధించారు.
- "వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్" 1972లో అమలులోకి వచ్చింది.
- ప్రాజెక్ట్ టైగర్ ను 1973 లో ప్రారంభించారు. "కోర్ - బఫర్" వ్యూహం ఆధారంగా దేశంలో తొమ్మిది తీగేట్ రిజర్వ్ లను ఏర్పాటు చేసారు.
"ప్రాజెక్ట్ టైగర్" తొలి దశలో 1973-74 మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి ద్వారా వివిధ రాష్ట్రాలలో 9 టైగర్ రిజర్వ్ లను స్థాపించారు.
- మానస్ - అస్సాం
- పలమౌ - బీహార్
- సిమిలిపాల్ - ఒరిస్సా
- కార్బెట్ - అప్పటి ఉత్తరప్రదేశ్
- కన్హా - మధ్యప్రదేశ్
- మెల్ఘాట్ - మహారాష్ట్ర
- బండిపూర్ - కర్ణాటక
- రణతంబోర్ - రాజస్థాన్
- సుందర్బన్స్ - పచ్చిమ బెంగాల్
దేశంలో 1973లో తొమ్మిది అడవులు, 270 పులులతో ప్రారంభమైన టైగర్ రిజర్వుల సంఖ్య 2018 నాటికీ 50 కి చేరుకుంది. "ప్రాజెక్ట్ టైగర్" తో పులులు మాత్రమే కాకుండా ఇతర అడవి జంతువుల జనాభా, వృక్ష సంపద, సహజ వనరులు, మొత్తం పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకి తోడ్పడింది.
రాజస్థాన్ లోని రణతంబోర్ నేషనల్ పార్క్ వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లకు అనువైనది, ఇష్టమైనది. వార్తాపత్రికలు, పుస్తకాలు, వాల్ పేపర్లు, సీనరీల రూపంలో మనం చూసే ప్రతి పులి ఫోటోలు 70శాతం రణతంబోర్ పార్క్ లో తీసినవే.
ది వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972 (2006లో సవరించారు)
వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1972 అనేది ఒక ముఖ్యమైనది. ఇది వేట పై నిషేధం, వన్యప్రాణుల ఆవాసాల రక్షణ నిర్వహణ, రక్షిత ప్రాంతాల ఏర్పాటు, వన్యప్రాణుల నుండి ఉత్పన్నమైన భాగాలు - ఉత్పత్తులపై నియంత్రణ, జంతు ప్రదర్శనశాలల ఏర్పాటు, నిర్వహణ, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి అభయారణ్యం, టైగర్ రిజర్వ్, పరిరక్షణ రిజర్వ్, కమ్యూనిటీ రిజర్వ్ లాంటి అనేక రకాలైన రక్షిత ప్రాంతాలు / రిజర్వుల గురించి తెలియజేస్తుంది.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ
టైగర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సు ప్రకారం 2005 డిసెంబర్ లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ఏర్పాటు చేశారు. ఇది భారత దేశంలో ప్రాజెక్ట్ టైగర్, అనేక టైగర్ రిజర్వు పర్యవేక్షణ, నిర్వహణ చేస్తుంది.
పిల్లి జాతులు
పిల్లి, చిరుత, సింహం, పులి మొదలైన పిల్లి జాతులు ఫెలిడే కుటుంబానికి చెందినవి. ఈ పిల్లి జాతులు ఆస్ట్రేలియా, అంటార్కిటికా మినహా దాదాపు భూగోళం లోని ప్రతి ఖండం లో కనిపిస్తాయి. పిల్లి జాతులన్నీ మాంసాహార క్షిరదాలు.
ఆవాసాలు
పిల్లి జాతులు ప్రధాన వర్గమైన పెద్ద పులుల జాతి ఆసియా ఖండానికి చెందినవి. ఆసియా ఖండంలో వివిధ దేశాలు పరస్పరం జంతువులను మార్పిడి చేసుకొనే ప్రక్రియలో భాగంగా పులులు ఇతర ఖండాల జంతు ప్రదర్శనశాలలో చూడవచ్చు. పిల్లి జాతుల్లో (క్యాట్ ఫ్యామిలీ) పులులు అత్యంత శక్తివంతమైనవి. ప్రస్తుతం ఆరు పులుల ఉపజాతులు విస్తరమై ఆవాస ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. ఇవి సాధారణంగా అడవులు, వర్షారణ్యాలు, పొదలు, గడ్డి భూములు, మడ లేదా మాంగ్రోవ్, పర్వతాలలో, మంచుతో కప్పబడిన టండ్రా ప్రాంతాలలో, సైబీరియా టైగర్ ప్రాంతాలలో, టైగర్ రిజర్వు, టైగర్ కన్జర్వేషన్ పార్కుల అంతటా విస్తరించాయి.
ఉపజాతులు
పులులలో పది ఉపజాతులుండేవి. "ట్రినిల్ పులి" అనే ఒక ఉపజాతి వేల సంవత్సరాలకు ముందు అంతరించింది. బాలి పులి, కాస్పియన్ పులి, జావా పులి మరో మూడు పులుల ఉపజాతులు 20వ శతాబ్దం మధ్యకాలం వరకు ఉనికిలో ఉండేవి, వాటి సంఖ్య క్రమేపి క్షిణించి 1970ల తర్వాత అంతరించాయి. పులుల ఉపజాతులలోని పది వర్గాలలో ప్రస్తుతం ఆరు మాత్రమే మనుగడలో ఉన్నాయి ఇవి రాయల్ బెంగాల్ టైగర్, సైబీరియన్ టైగా, ఇండోచైనీస్ టైగర్ దక్షణ చైనా టైగర్, మలయన్ టైగర్. అన్ని పులి ఉప జాతుల్లో సైబీరియన్ పులి ఆకారం పెద్దది. సుమత్రా పులి ఆకారంలో చిన్నది.
జిమ్ కార్బెట్ గౌరవార్థం ఇండో - చైనీస్ పులికి జిమ్ కార్బెట్టి అని పేరు పెట్టారు. స్నో టైగర్ లేదా తెల్ల పులులు కూడా బెంగాల్ టైగర్ ఉపజాతికి చెందినవే. అన్ని పులుల కనుగుడ్లు పసుపురంగులో ఉంటే తెల్ల పులి కనుగుడ్లు నీలిరంగులో ఉంటాయి.
నేషనల్ ఎనిమల్
ప్రస్తుతం ప్రపంచంలో కేవలం నాలుగు దేశాలు మాత్రమే పులిని జాతీయ జంతువుగా ప్రకటించాయి.
బెంగాల్ టైగర్ - భారతదేశం, బాంగ్లాదేశ్ జాతీయ జంతువు.
సైబీరియన్ టైగర్ - దక్షిణ కొరియా దేశ జాతీయ జంతువు.
మలయన్ టైగర్ - మలేషియా దేశ జాతీయ జంతువు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం
"అంతర్జాతీయ పులుల దినోత్సవం" లేదా "ఇంటర్నేషనల్ టైగెర్స్ డే" ను ఏటా జులై 29న జరుపుతారు. దీనినే "గ్లోబల్ టైగర్ డే" అని కూడా పిలుస్తారు. పులి జాతి పరిరక్షణ ప్రాముఖ్యం, అవగాహన పెంచే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు.2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన అంతర్జాతీయ టైగర్ ఫోరంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం - జులై 29
అంతర్జాతీయ పులుల దినోత్సవం - జులై 29
సెయింట్ పీటర్స్ బర్గ్ డిక్లరేషన్
నవంబర్ 2010 లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో మొదటిసారిగా "టైగర్ సమ్మిట్", గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రాం ను నిర్వహించారు. సదస్సులో క్రమేపి పులుల జాతి క్షిణిస్తున్నందున 2022 సంవత్సరం నాటికీ వాటి సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనినే టిx2 (Tx2) అని కూడా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 13 పులి శ్రేణి దేశాలు పాల్గొన్నాయి. ప్రపంచంలోని పులుల సంఖ్య 5000 లోపే ఉంటుంది. ఇందులో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయి. ప్రస్తుతం వివిధ దేశాలు పులుల సంఖ్యను పెంచే దిశగా పాలు చట్టాలు చేశాయి. దీనిలో భాగంగా పులుల సంఖ్యను పెంచడం, వేటగాళ్లపై అణచివేత చర్యలు, పులి శరీర భాగాల అక్రమ రవాణా అరికట్టడం లాంటి వివిధ అంశాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పులుల సంఖ్యను అభివృద్ధిపరిచే కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు.
టైగర్ రేంజ్ దేశాలు
టైగర్ రేంజ్ కంట్రీస్ అంటే ఆయా దేశాల్లో పులులు ఉండి, అవి అడవుల్లో స్వేచ్ఛగా మసలుతున్న దేశాలు. ఇందులో బాంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా,. మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం ఉన్నాయి.
పులుల జనాభా తగ్గడానికి కారణాలు
జాతీయ టైగర్ కన్జర్వేషన్ ఆథారిటీ ప్రకారం వేటగాళ్ల వలన 40 శాతం పులులు అంతరించిపోతున్నాయి. పులి చర్మం, దంతాలు, గోళ్ళతో వస్తువులు తయారు చేస్తున్నారు. ఎముకలు, మీసం, ఇతర అవయవాలు చైనా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. పులి అవయవాలకు అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. రోడ్లు, రైలు పట్టాలు దాటుతుండంగా వాహనాలు ఢీకొని మరణించే వాటి సంఖ్య నాలుగు శాతంగా ఉంది. మరో 50 శాతం పులులు రోగాలు, వృద్ధాప్యం, వాటిలో అవి సరిహద్దుల కోసం పోట్లాడుకున్నప్పుడు మరణిస్తున్నాయి.
పులి శరీర భాగాల అక్రమ వ్యాపారం విలువ అంతర్జాతీయ మార్కెట్ లో సాలీనా సుమారు ఆరు బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. పులి శరీరం, చర్మం, కనుగుడ్లు, విస్కర్స్, ఎముకలు, మెదడు, తోక మరియు ఇతర భాగాలకు అక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది.
ప్రస్తుతం చైనా, జపాన్, తైవాన్, కొరియా, వియత్నామ్, హాంకాంగ్ లోని దాదాపు 60% ప్రజలు పులి సాటిరా భాగాలను ఔషధాల కోసం వినియోగించడం మంచిదనీ భావిస్తున్నారు.
ఈ దేశాల్లో
🔸జత పులి కళ్ళు $200
🔸ఒక పంజా విలువ $1000
🔸పులి ఎముక కిలోగ్రాముకు $30 నుంచి $80
🔸పులి ఎముకల పొడితో చేసిన సారా సీసా (టైగర్ వైన్) 1200 అమెరికా డాలర్లు
రాష్ట్రాల వారీగా పులుల సంఖ్య
కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో పులులున్నాయి.
శివాలిక్ - గంగాటిక్ సాదా ల్యాండ్ స్కేప్ కాంప్లెక్స్
• ఉత్తరాఖండ్.........
సంవత్సరం 2006 లో 178
సంవత్సరం 2010 లో 227
సంవత్సరం 2014 లో 340
• ఉత్తర్ ప్రదేశ్...........
సంవత్సరం 2006 లో 109
సంవత్సరం 2010 లో 118
సంవత్సరం 2014 లో 117
• బీహార్.....................
సంవత్సరం 2006 లో 10
సంవత్సరం 2010 లో 8
సంవత్సరం 2014 లో 28
• మొత్తం ..................
సంవత్సరం 2006 లో 297
సంవత్సరం 2010 లో 353
సంవత్సరం 2014 లో 485 ల పులులు ఉండెను
సెంట్రల్ ఇండియన్ ల్యాండ్ స్కేప్ కాంప్లెక్స్, తూర్పు కనుమలు ల్యాండ్ స్కేప్ కాంప్లెక్స్
• ఆంద్రప్రదేశ్...........……
సంవత్సరం 2006 లో 95
సంవత్సరం 2010 లో 72
సంవత్సరం 2014 లో 68
• ఛత్తీస్ గఢ్ ………………
సంవత్సరం 2006 లో 26
సంవత్సరం 2010 లో 26
సంవత్సరం 2014 లో 46
• మధ్యప్రదేశ్………………
సంవత్సరం 2006 లో 300
సంవత్సరం 2010 లో 257
సంవత్సరం 2014 లో 308
• మహారాష్ట్ర………………
సంవత్సరం 2006 లో 103
సంవత్సరం 2010 లో 167
సంవత్సరం 2014 లో 190
• ఒరిస్సా……………………
సంవత్సరం 2006 లో 45
సంవత్సరం 2010 లో 32
సంవత్సరం 2014 లో 28
• రాజస్థాన్………………
సంవత్సరం 2006 లో 32
సంవత్సరం 2010 లో 38
సంవత్సరం 2014 లో 45
• జార్ఖండ్…………………
సంవత్సరం 2006 లో ----
సంవత్సరం 2010 లో 10
సంవత్సరం 2014 లో 3
•మొత్తం……………………
సంవత్సరం 2006 లో 601
సంవత్సరం 2010 లో 603
సంవత్సరం 2014 లో 688 పులులు ఉండెను
పచ్చిమ కనుమలు ల్యాండ్ స్కేప్ కాంప్లెక్స్
• కర్ణాటక …………………
సంవత్సరం 2006 లో 290
సంవత్సరం 2010 లో 300
సంవత్సరం 2014 లో 408
• కేరళ ……………………
సంవత్సరం 2006 లో 46
సంవత్సరం 2010 లో 71
సంవత్సరం 2014 లో 136
• తమిళనాడు ……………
సంవత్సరం 2006 లో 76
సంవత్సరం 2010 లో 163
సంవత్సరం 2014 లో 229
• గోవా ……………………
సంవత్సరం 2006 లో 0
సంవత్సరం 2010 లో 0
సంవత్సరం 2014 లో 5
• మొత్తం …………………
సంవత్సరం 2006 లో 412
సంవత్సరం 2010 లో 534
సంవత్సరం 2014 లో 778 పులులు ఉండెను
సంవత్సరం 2006 లో 290
సంవత్సరం 2010 లో 300
సంవత్సరం 2014 లో 408
• కేరళ ……………………
సంవత్సరం 2006 లో 46
సంవత్సరం 2010 లో 71
సంవత్సరం 2014 లో 136
• తమిళనాడు ……………
సంవత్సరం 2006 లో 76
సంవత్సరం 2010 లో 163
సంవత్సరం 2014 లో 229
• గోవా ……………………
సంవత్సరం 2006 లో 0
సంవత్సరం 2010 లో 0
సంవత్సరం 2014 లో 5
• మొత్తం …………………
సంవత్సరం 2006 లో 412
సంవత్సరం 2010 లో 534
సంవత్సరం 2014 లో 778 పులులు ఉండెను
నార్త్ ఈస్టర్న్ హిల్స్ బ్రహ్మపుత్ర వరద మైదానాలు
• అస్సాం …………………
సంవత్సరం 2006 లో 70
సంవత్సరం 2010 లో 143
సంవత్సరం 2014 లో 167
• అరుణాచల్ ప్రదేశ్ …………
సంవత్సరం 2006 లో 14
సంవత్సరం 2010 లో 0
సంవత్సరం 2014 లో 27
• మిజోరం …………………
సంవత్సరం 2006 లో 6
సంవత్సరం 2010 లో 5
సంవత్సరం 2014 లో 3
• బెంగాల్…………………
సంవత్సరం 2006 లో 10
సంవత్సరం 2010 లో 0
సంవత్సరం 2014 లో 3
• సుందర్ బన్స్ …………
సంవత్సరం 2006 లో 0
సంవత్సరం 2010 లో 70
సంవత్సరం 2014 లో 76
• మొత్తం …………………
సంవత్సరం 2006 లో 100
సంవత్సరం 2010 లో 218
సంవత్సరం 2014 లో 277 పులులు ఉండెను.
🔸పూర్తి మొత్తం ……
సంవత్సరం 2006 లో 1411
సంవత్సరం 2010 లో 1706
సంవత్సరం 2014 లో 2226 పులులు ఉండెను.
పులుల జనాభా సేకరణ
ప్రజల జనాభాను లెక్కించడానికి గణన నిర్వహిస్తున్నట్లుగానే టైగర్ సెన్సస్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రస్తుతం 2018 సంవత్సరానికి పులుల జనాభా సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టైగర్ సెన్సెస్ 2018 ఫలితాలు, వివరాలను జనవరి 2019 లో విడుదల చేస్తారు.
18 రాష్ట్రాల్లో ఉన్న అన్ని జాతీయ పార్కులు, టైగర్ రిజర్వులు, ఇతర వన్యప్రాణి ప్రాంతాలలో 14000 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. జనాభా గణనలో సహాయపడే "ఎం స్ట్రైప్స్" అనే అనువర్తనం(యాప్) కూడా వారు ప్రారంభించారు.
మనుషుల వేలి ముద్రల లాగే, ఏ రెండు పులుల నలుపు చారలు ఒకే ల ఉండవు.
కెమెరా లో బంధించిన ప్రతి పులి ఛాయా చిత్రం పరిశీలిస్తారు. పులుల నలుపు చారల ను విశ్లేషించి తదనుగుణంగా జనాభా లెక్క కట్టే సాఫ్ట్ వేర్
ప్రస్తుతం అందుబాటులో ఉంది.
పులుల నివాస ప్రాంతాల్లో భూమి మీద వాటి పాదముద్రలు, గోళ్ళ గుర్తులు, వాటి పేడ ఆధారంగా డిఎన్ఏ పరీక్షలు చేసి కూడా గణాంకాలను సేకరిస్తారు. పులుల జనాభా సేకరణ కోసం, భారత దేశం ప్రస్తుతం పాటించే పద్దతి "ఇండెక్స్ కాలిబ్రేషన్". ఇండెక్స్ కాలిబ్రేషన్ పద్దతిలో తప్పులకు తావుండవచ్చని విమర్శలు లేకపోలేదు.
మరికొన్ని దేశాలు పులి జనసంఖ్య కోసం "బేసియన్ స్మూథింగ్ మోడల్" అనే పద్దతి అవలంబిస్తున్నాయి. భారతదేశపు టైగర్ సెన్సస్ లేదా పులుల జనాభా గణన 2018లో నేపాల్, బాంగ్లాదేశ్, భూటాన్ దేశాలు మొదటిసారి పాల్గొన్నాయి.
భారతదేశ టైగర్ రిజర్వులు, పార్కులు కొన్ని దేశ సరిహద్దుల్లో ఉండడంతో పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బాంగ్లాదేశ్ లలో కూడా ఈ టైగర్ సెన్సన్ జరుగుతుంది. ఉదాహరణకు భూటాన్లోని "రాయల్ మానస్ నేషనల్ పార్క్" అస్సాంలో "మానస్ నేషనల్ పార్క్" కలిసి ఉంటాయి. ఏక కాలంలో బహు దేశాల్లో ఈ పులుల జనాభా సేకరణ నిర్వహణతో అన్ని దేశాలకు ఉపయోగకరం.ఒకే పులిని పాలు మార్లు గణన చెయ్యడం లాంటివి నివారించవచ్చు. ఈ దేశాల మధ్య ఎన్ని పులులు భాగస్వామ్యం అవుతాయో లెక్కించవచ్చు.
🔸బీహార్ లోని వాల్మీకి టైగర్ రిజర్వ్, నేపాల్లోని చిత్వాన్ నేషనల్ పార్క్ లకు ఉమ్మడి సరిహద్దు ఉంది.
🔸ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్, నేపాల్ లోని శుక్లఫాంతా నేషనల్ పార్క్ సరిహద్దు కలిసి ఉంది.
స్వభావం - లక్షణాలు
🔸ఇవి ఒంటరిగా నివసిస్తాయి.
🔸సాధారణంగా రాత్రి వేళలో వేటాడుతాయి.
🔸తనకన్నా రెట్టింపు బరువున్న జంతువును వేటాడగలదు.
🔸ఆరోగ్యవంతమైన పులి ఒకసారి 50 కిలోల మాంసం తినగలదు.
🔸నవంబర్ - ఏప్రిల్ మధ్య పులుల పునరుత్పత్తి జరుగుతుంది. నాలుగు నెలల్లో కాన్పయి పులి పిల్లలకు జన్మనిస్తుంది.
🔸ఒక కాన్పుకి రెండు నుంచి నాలుగు పిల్లలను పెడతాయి. పులి పిల్లలు ఆరు నెలల వరకు గుహలో, పొదలు బండల మధ్య, తొర్రలలోనే జీవిస్తాయి. రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు తల్లి పులి తోనే జీవిస్తాయి.
నిర్ణిత పరిధి (టెరిటరీ)
🔸రూతు మాన కాలం, ఆహరం సాంద్రతపై పులుల నివాస పరిధి ఆధారపడి ఉంటుంది. అధిక ఆహార సాంద్రత ప్రాంతాల్లో, పరిధి శ్రేణులు చిన్నవిగా ఉంటాయి.
🔸oka మగ పులి నిర్ణిత నివాస పరిధిలో అనేక ఆడ పులుల నివాసం ఉండవచ్చు లేదా అతివ్యాప్తి చెందవచ్చు.
🔸ఒక మగ పులి నిర్ణిత నివాస పరిధి 50 నుంచి 300 ల చదరపు కి. మీ. ల వరకు ఉంటుంది.
🔸తన నివాస పరిధి లేదా టెరిటరీల్లో మరొక యుక్త వయసున్న మగ పులుల చొరబాటును ఇవి సహించలేవు. దాంతో మగ పులుల మధ్య అనునిత్యం పోటీ, వైరం, పోరాటాలకు దారితీసి ప్రాణ నష్టం జరుగుతుంది.
🔸తన నిర్ణిత పరిధిని ఇతర మగ పులులు గుర్తించి డానికి దూరంగా ఉండడానికి, ఆడ పులులను ఆకర్షించడానికి, మగ పులులు తమ సువాసన వెదజల్లుతాయి. అంతే కాకా, తమ పేడ లేదా మల విసర్జన విడిచిపెట్టి తన సరిహద్దును నిర్వచిస్తాయి.
🔸నెల, పచ్చిక, మట్టి, వృక్షాల మొదలులో, బండరాళ్ళపై వాటి గోళ్ల గుర్తులు వేస్తాయి. ప్రత్యర్థి మగ పులులు ఈ గోళ్ళ గుర్తులను బట్టి ఆ భూభాగంలో నివసిస్తున్న మగ పులి ఎంత పెద్దదో, బరువైనదో, బలమైనదో గ్రహించగలవు.
శరీర నిర్మాణం
🔸పులులకు నారింజ - ఎరుపు రంగు తోలుపై మొత్తం నల్లని చారలుంటాయి. ఈ చారల పరిమాణం మందం, చారకు చారకు మధ్య అంతరం, చారల పొడవు మరియు రంగు ప్రతి పులికి వేరుగా ఉంటుంది. ఈ చారలు నల్లటి నలుపు రంగు నుండి లేత గోధుమ రంగులో కూడా ఉండొచ్చు. అందుకే ఏ ఒక్క పులి చారల ను పోలిన మరొక పులి ఉండదు, సృష్టిలో ఉన్న పులులన్నిటికి చారలు వేరుగా ఉంటాయి.
🔸పులి గర్జన, అరుపు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినవచ్చు. పులులు ములుగు, గర్జన ద్వారా ఇతర పులులతో సంకేతాలు, సంభాషణలు జరుపుతాయి.
🔸పులి తోక దాదాపు మూడు అడుగులుంటుంది. శరీర సమతుల్యత కోసం, భావజాలం, కమ్యూనికేషన్ కోసం పులులు వాటి తోకను ఉపయోగిస్తాయి. పులి తోకని ఒక వైపు నుంచి మరో వైపు వేగంగా కదిలిస్తుంటే ఆ పులి ఆకలికి, కోపానికి, అసహనానికి గురవుతుందని అర్థం.పులి శాంతంగా ఉన్నప్పుడే తోక వదులుగా, వేలాడుతున్నట్లు ఉంటుంది.
🔸పులుల చెవుల వెనుక విలక్షణమైన తెల్లని మచ్చలు కలిగి ఉంటాయి. ఈ తెల్లని మచ్చలు రాత్రులు మెరుస్తూ కనబడి ఇతర జంతువులకు పులి సంచరిస్తుందని సూచన ఇస్తుంది.
🔸పులి రెండు రకాల జుట్టుని కలిగి ఉంటుంది.గార్డు హెయిర్, అండర్ఫర్. గాలి నుంచి శరీరాన్ని కప్పి వెచ్చదనాన్ని అందిస్తుంది అండర్ఫర్. కొంచెం పొడవైనది, మన్నికైనది కాబట్టి ముళ్ళు, పొదలు, క్రిమికీటకాల బారి నుంచి రక్షణ కవచంగా పని చేస్తుంది గార్డు హెయిర్.
🔸పులులకు నీరు చాలా ఇష్టం. అవి తరచుగా అటవీ ప్రాంతాల్లో ఉన్న సరస్సులు, నదులు, సెలయేర్లు, వాగులలో ఈత కొడుతూ సంచరిస్తూ ఉంటాయి. దప్పిక తీర్చుకోడానికి వచ్చే లేళ్ళు, పశువులు లాంటి జంతువులను వేటాడడానికి ఈ ప్రాంతాలు అనువైనవి.
🔸పదునైన పంజాలతో పాటు పెద్ద మందమైన పాదాలను పులులు కలిగి ఉంటాయి కాబట్టి శబ్దం లేకుండా నడుస్తూ ఒక్క ఉదుటున ఆహార జంతువు పై దాడి చేయగలవు.
🔸ఇంద్రియ సమాచారం గుర్తించే విష్కర్స్(మీసాలు) పులి శరీరంలో ఐదు ప్రదేశాల్లో ఉంటాయి. ఇవి మెదడు లో సోమటోసెన్సరీ కార్టెక్స్ కు సంకేతాలిస్తాయి. ఈ విష్కర్స్ఉండే ప్రదేశంలో నరాల ద్వారా పులులు థమ పరిసరాలలో దూరాలు, మార్పులను గుర్తించగలవు. పులులు వేటాడినప్పుడు, ఆ జంతువు మెడపై ఉన్న కరోటిడ్ అర్జరీ పై దాడి చేసి పళ్లతో చీల్చి వేసో ఓక్ఠ వేటులో చంపుతాయి. ఆ ప్రాణి బ్రతికి ఉందొ, నాడి పోయిందో లేదో నిర్దారించడానికి గాను పులులు తమ విష్కర్స్ ను ఉపయోగించి తెలుసుకుంటాయి.
టైగర్ రిజర్వ్స్
దేశంలో టైగర్ రిజర్వులను ఐదు భాగాలుగా విభజించారు. అవి
1. శివాలిక్ - గంగాటిక్ సాదా ల్యాండ్ స్కేప్ కాంప్లెక్స్
2. పశ్చిమ కనుమలు ల్యాండ్ స్కేప్ కాంప్లెక్స్
3. సెంట్రల్ ఇండియా లాండ్ స్కేప్ కాంప్లెక్స్
4. తూర్పు కనుమలు ల్యాండ్ స్కేప్ కాంప్లెక్స్
5. ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర వరద మైదానాలు
టైగర్ రిజర్వ్స్
టైగర్ రిజర్వ్ పేరు రాష్ట్రం చ. కి.మీ. నాగార్జున సాగర్ శ్రీ శైలం(భాగం) ఆంధ్రప్రదేశ్ 3,296 నామ్దఫా అరుణాచల్ 2,053 ప్రదేశ్ కమ్లాంగ్ టైగర్ అరుణాచల్ 783 రీజర్వ ప్రదేశ్ పక్కే అరుణాచల్ 1,198 ప్రదేశ్ మానస్ అస్సాం 3,151 నమేరి అస్సాం 344 ఒరంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం 492 కజిరంగా అస్సాం 1,174 వాల్మీకి బీహార్ 899 ఉదంతి సీతానది ఛత్తీస్ గఢ్ 1,843 ఆశ్చన్క్మర్ ఛత్తీస్ గఢ్ 914 ఇంద్రావతి ఛత్తీస్ గఢ్ 2,799 పాలము జార్ఖండ్ 1,130 బందీపూర్ కర్ణాటక 1,456 భద్ర కర్ణాటక 1,064 దండేలి కర్ణాటక 1,098 నాగరొళె కర్ణాటక 1,206 బిలిగీరి రంగనాథ ఆలయం కర్ణాటక 575 పెరియార్ కేరళ 925 పరంబికులం కేరళ 644 కాన్హ మధ్యప్రదేశ్ 2,052 పెంచ్ మధ్యప్రదేశ్ 1,180 బంధవాగ మధ్యప్రదేశ్ 1,598 పన్నా మధ్యప్రదేశ్ 1,579 సాత్పూరా మధ్యప్రదేశ్ 2,133 సంజయ్ మధ్యప్రదేశ్ 1,675 మేల్ ఘాట్ మహారాష్ట్ర 2,769 తడోబా-అంధారి మహారాష్ట్ర 1,728 పెంచ్ మహారాష్ట్ర 741 సహ్యాద్రి మహారాష్ట్ర 1,166నవేగావ్ మహారాష్ట్ర 654
బోర్ మహారాష్ట్ర 138 దంప మిజోరం 988 సిమిలిపల్ ఒడిషా 2,750
సత్కోసియా ఒడిషా 964 రనతంబోర్ రాజస్థాన్ 1,411 సరిస్కా రాజస్థాన్ 1,213 ముకుంద్రా హిల్స్ రాజస్థాన్ 760 కశక్కాడ్ ముందంతురై తమిళనాడు 1,602
అన్నామలైలో ఉదయ మండలం తమిళనాడు 1,480 ముదుమలై తమిళనాడు 689 సత్య మంగలం తమిళనాడు 1,408 కవ్వాల్ తెలంగాణ 2,019
అమ్రాబాద్ తెలంగాణ 2,611 దుద్వా ఉత్తరప్రదేశ్ 2,202 ఫిలిబిత్ ఉత్తరప్రదేశ్ 730 అమంగడ్ ఉత్తరప్రదేశ్ 81 కార్బెట్ ఉత్తరాఖండ్ 822
రాజాజీ టిఆర్ ఉత్తరాఖండ్ 1,075
సుందర్బన్ పచ్ఛిమబెంగాళ్ 2,585
బక్స పచ్ఛిమబెంగాళ్ 758 మొత్తం 70,602
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box