రాజస్థాన్
రాజస్థాన్ అంటే మనకు గుర్తొచ్చేది అక్కడి కోటలు, రాజభవనాలు, పర్యాటక స్థలాలు, ఒంటెల సవారీలు, ఎడారి ప్రాంతాలు కదూ. అవును దింతో పాటు రాజస్థాన్ గురించి ఇంకా బోలెడు విషయాలు తెలుసుకుందాం.
భారత దేశం లో వైశ్యాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్ కు పచ్చిమాన పాకిస్థాన్ దేశం ఉంది. ఇంకా నైరుతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాన పంజాబ్ రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశ్యాల్యం 3లక్షల 42వేల చదరపు కి. మీ. (3,42,236 చ. కి. మీ.) (1,32,139 చదరపు మైళ్ళు).
రాజస్థాన్ రాష్ట్రము లో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి .
ఆరావళి పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి.
ఈ పర్వతాలు రూతుపవనాలను అడ్డుకోవడం వల్ల అది ఎడారిగా మారింది. మరోప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణతంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రమము, భరత్ పూర్ పక్షి ఆశ్రమము లు ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపుర్ నగరం.
రాష్ట్ర అవతరణ చరిత్ర
రాజపుత్రులచే పాలింపబడినది గనుక రాజస్థాన్ "రాజపుటాన" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువ కాలం యుద్ధప్రియులైన రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటి వారెవరు పూర్తిగా ఆక్రమించలేక పోయారు. అయితే వేరు వేరు ఒడంబడికల ద్వారా బ్రిటిషు పాలకులు మాత్రం పెత్తనం చెలాయించారు. ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి.
మొదటి దశ
1948 లో భరత్ పూర్, అల్వార్ రాజ్యాల్లో పెద్ద ఎత్తున మతపరమైన ఘర్షణలు, జాతి విభేదాలు తలెత్తాయి. వాటిని అదుపులోకి తీసుకురావడం లో ఆయా రాజ్యాధిపతులు విఫలం చెందారు.దాంతో జోక్యం చేసుకున్న భారత ప్రభుత్వం ఆ రాజ్యాలను తమ పర్యవేక్షణలోకి తీసుకుంది. వీటి పొరుగు ప్రాంతాలు కరౌలి, ధోల్పూర్ లతో కలిసి అల్వార్, భరత్ పూర్ లను ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడాలని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఆ మేరకు ఆ నాలుగు రాజ్ పూటానా లో మత్స్య యూనియన్ గా ఏర్పడ్డాయి.
రెండో దశ
1948లో మత్స్య యూనియన్ ఏర్పాటు చూసి ఇతర తూర్పు రాజపుటానా, దక్షిణ రాజపుటానా పది రాజ్యాలు కలిసి తూర్పు రాజ్యస్థాన్ గా ఏర్పడ్డాయి. ఆ పది ప్రాంతాలు:- బుండి, టోంక్, జలావర్, షాపురా, ప్రతాప్ గఢ్, దుంగార్పూర్, కిషన్ గఢ్, కుషాల్ గఢ్, బానస్వర, కోట
మూడో దశ
1948లో మేవార్ రాజ్యం (ఇప్పటి ఉదయ్ పూర్) కూడా తూర్పు రాజస్థాన్ యూనియన్లో ఐక్యమైంది. అప్పుడు ఆ పేరును యునైటెడ్ రాజస్థాన్ గా మార్చారు.
నాలుగో దశ
1949 ఆరంభంలో జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, బికనీర్, నిమ్రా, లావా మొదలైన ఆరు రాజ్యాలు యునైటెడ్ రాజస్థాన్ లో చేరాయి. అప్పుడు యునైటెడ్ రాజస్థాన్ ను కాస్తా గ్రేటర్ రాజస్థాన్ గా పేరు మార్చారు.
ఐదో దశ
1949లో మత్స్య యూనియన్ కూడా గ్రేటర్ రాజస్థాన్ లో కలిసిపోయింది. అప్పటినుంచి యునైటెడ్ రాజస్థాన్ పేరుని యునైటెడ్ ఆఫ్ గ్రేటర్ రాజస్థాన్ గా మార్చారు.
ఆరో దశ
1948 నుంచి 1950 వరకు ఏ సంఖ్యలో చేరకుండా ఒంటరిగా ఉన్న ఒకే ఒక రాజ్యం సిరోహి. 1950లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిరోహి రాజ్యం కూడా యునైటెడ్ స్టేట్ ఆఫ్ గ్రేటర్ రాజస్థాన్ లో చేరిపోయింది. అప్పటి నుంచి ఒకప్పటి రాజ్ పూటానా రాజ్యం యునైటెడ్ రాజస్థాన్ గా రూపాంతరం చెందింది.
1956లో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి దేశం లో ఉన్న అన్ని రాష్ట్రాల భూభాగాల సరిహద్దులు సహా భాషా విధానాలతో వాటిని పునర్వ్యవస్థీకరించే సంస్కరణ చేపట్టింది. ఈ సంస్కరణలో భాగంగా సరిహద్దు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు మరో రాష్ట్రం లోకి కలిపారు.
రాజస్థాన్ పునర్వ్యవస్థీకరణ
- 1956లో అన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినట్లే యునైటెడ్ రాజస్థాన్ లో అజ్మీర్, మర్వార్ ప్రాంతం, మధ్తప్రదేశ్ లోని భాన్ పురా తెహసీలు, గుజరాత్ నుంచి అబూ తెహసీలు రాజస్థాన్ లో కలిసిపోయాయి. అంతిమంగా 1956 నవంబర్ లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రకటన ప్రకారం రాజస్థాన్ గా ఏర్పాటైంది.
రాజస్థాన్ లోని జిల్లాలు
1. అజ్మీర్2. అల్వార్
3. బనస్వరా
4. బారన్
5. బార్మర్
6. భారతపూర్
7. భిల్వారా
8. బికనీర్
9. బుండి
10. చత్తోర్ గఢ్
11. చురు
12. దౌసా
13. ధోల్పూర్
14. దుంగార్పూర్
15. హనుమాంగఢ్
16. జైపూర్
17. జైసల్మేర్
18. జలోర్
19. ఝాలావర్
20. జుంజున్
21. జోధ్ పూర్
22. కరౌలి
23. కోట
24. నాగౌర్
25. పాలి
26. ప్రతాప్ గఢ్
27. రాజసమండ్
28. సవాయి
29. మాధోపూర్
30. సీకార్
31. సిరోహి
32. శ్రీ గంగానగర్
33. టోంక్
34. ఉదయపూర్
రాజస్థాన్ లోని కోటలు
రాజస్థాన్ లో ఎన్నో కోట కట్టడాలు ఇప్పటికి రాచరికానికి, చరిత్రకి అద్దంపడుతుంటాయి.
అచలగఢ్ కోట
మౌంట్ అబుకి 11 కిలోమీటర్ల దూరంలో ఈ కోటను పరామరా వంశస్తులు కట్టారు. తరువాత 1452లో ఈ కోటకు రాణా కుంభ అనే రాజు అచలగఢ్ అనే పేరు పెట్టాడు. ఈ కోటాలో 1513లో కట్టబడిన జైన్ దేవాలయాలు ఉన్నాయి.
చిత్తోర్ గఢ్
180 మీటర్ల ఎత్తులో ఉన్న చిత్తోర్ గఢ్ కోట ఈ నగర ప్రధాన ఆకర్షణలో ఒకటి. ఈ కోట లో ఉన్న వివిధ కట్టడాలలో ప్రతి నిర్మాణం వెనుక ఏదో ఒక కథ ఉంది. అందమైన చారిత్రక ప్రాంతం "ఫతేహ్ ప్రకాష్ ప్యాలేష్" ను మహారణా ఫతేహ్ సింగ్ నిర్మించాడు. ఇవే కాక ఈ ప్రాంతం లో సంవరియజి దేవాలయం, తుల్జాభవాని దేవాలయం, జోగినియా మాత దేవాలయం, మాత్రి కుండియ దేవాలయం వంటి అనేక ధార్మిక కేంద్రాలు ఉన్నాయి. 50 చ. కి.మీ. లలో విస్తరించి ఉన్న బస్సి అభయారణ్యం, వృక్ష జంతు సంపద కల్గిన సీతామాత అభయారణ్యం, భైన్సరోర్ గఢ్, వన్యప్రాణి అభయారణ్యం కూడా ప్రఖ్యాతి గాంచాయి.ప్రతాప్ గఢ్ దగ్గరలో 16వ శతాబ్దపు దేవగఢ్ కోట కూడా ఒక ప్రసిద్ధ పర్యటక కేంద్రం.
కుంభల్ గఢ్
ఈ కోట ఉదయ్ పూర్ కి దగ్గరలోని రాజసమండ్ జిల్లాలో కలదు. ఈ కోటలోని గోడ రెండవ అతిపెద్ద గోడ గా పరిగణిస్తారు (చైనా గోడ తర్వాత). కుంభల్ గఢ్ కోట మహారణా ప్రతాప్ యొక్క జన్మ స్థానం. 1448 నుంచి 1458 వరకు మహారణా కుంభా ఈ కోటను శిల్పకారుడైన మండన యొక్క ఆధ్వర్యంలో నిర్మించారు.
మెహ్రాన్ గఢ్
జోధాపూర్ లోని మెహ్రాన్ గఢ్ కోట కూడా భారత దేశం లోని ప్రసిద్ధ కోటలలో ఒకటి.దీనిని 1459లో నిర్మించారు. ఈ కోటలో ప్రవేశించడానికి 7ద్వారాలు కలవు. ఈ కోటలో ఏంతో అందమైన కట్టడాలు, నిర్మాణాలు ఉన్నాయి. చిడియకుంట్ కొండపైన నెమలి ఆకారంలో ఉన్న ఈ కోటను "మోర్ ధ్వజ్ గఢ్" లేదా "మయూర్ ధ్వజ్ గఢ్" అని కూడా పిలుస్తారు.
జైసల్మేర్ గఢ్
ఇది ఒక అద్భుతమైన కోట. దీనిని రావల్ జైసల్ ద్వారా 1155లో నిర్మించడమైంది. ఈ కోట 460మీ. ల పొడవు 230 మీ. ల వెడల్పు కలదు. ఈ కోట యొక్క ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే దీని నిర్మాణంలో పసుపు పచ్చని రాళ్లను మాత్రమే ఉపయోగించారు. ఈ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చుతూ మిగితా దేన్నీ కూడా ఉపయోగించకుండా రాళ్లతో మాత్రమే నిర్మించారు. ఈ కోట చిత్తోర్ గఢ్ కోట తర్వాత నివాసయోగ్యమైన కోట.
అమెర్ కోట
ఈ కోట జైపూర్ లోని ఆరావళి పర్వతాలమీద నిర్మించబడింది. మాన్సింగ్ అనే రాజు ద్వారా 1592 లో ఈ కోటను నిర్మించారు. ఈ కోటలో శిష్ మహల్, సంతోష్ మందిరం, జగత్ శిరోమణి మందిరం, మావటా జలాశయం, దిలారాముని తోట మరియు కేశర్ క్యారీ ఇక్కడి ప్రదర్శనీయ స్థలాలు.
ఇవ్వే కాకా ఇంకా ప్రసిద్ధి చెందిన చాలా కోటలు కలవు
- బార్మేర్ కోట - బార్మర్
- భాటనేర్ కోట - హనుమాన్ గఢ్
- దేవగిరి కోట - కరౌలి
- గగ్రోన్ కోట - జలావర్
- గఢ్ ప్యాలెస్ - కోట
- గూగోర్ కోట - బారన్
- హిల్ ఫోర్ట్ కేసురాలి - అల్వార్
- జైగఢ్ కిల్లా - జైపూర్
- జైసల్మేర్ కోట - జైసల్మేర్
- జాలోర్ కోట - జాలోర్
- జలావర్ కోట - జలావర్
- జునా కోట మరియు ఆలయం - బార్మర్
- జునాగఢ్ కోట - బికనీర్
- ఖన్ధార్ కోట - సవాయ్ మాధోపూర్
- ఖేజర్ల కోట - జోధ్ పూర్
- ఖిమ్సర్ కోట - నాగౌర్
- లక్సమన్ గఢ్ కోట - శేఖ్వాటి
- లోహగఢ్ కోట - భరత్ పూర్
- బాల కీలా - అల్వార్
- బాద్ నొర్ కోట - భిల్వారా
సంస్కృతి
రాజస్థాన్ లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్త్స్ ఎక్కువగా ఉంది. అక్కడి స్త్రీలు ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తారు. భారత దేశం లో విడాకుల సంఖ్య అతి తక్కువగా ఉన్న 2,3 hi రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. దేశం లో ఇతర రాష్ట్రాలలో కాకుండా అక్కడి స్త్రీలు బయటకు ఒంటరిగా వెళ్ళుట, ఫ్యాషన్ గా ఉండుట కనిపించరు. సినిమా, మీడియా ప్రభావం అతి తక్కువగా ఉండటం, పురుషుల కట్టుబాట్ల పట్టింపు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. అక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు అతి తక్కువ.
రాజస్థాన్ లోని మందిరాలు
భారత దేశం చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్ లో ఉన్నాయి.
- బ్రహ్మ మందిరం - పుష్కర్
- అచలేశ్వర్ మహాదేవ మందిరం - మౌంట్ అబూ వద్ద కల అచల్ గఢ్ కోట
- ఆదినాథ్ మందిరం - ఉదయ్ పూర్ సమీపంలో రిఖాబ్ దేవ్ వద్ద నున్న జైన మందిరం
- బిజోలియా మందిరాలు - బున్డి వద్ద బిజోలియాలో ఉన్న మందిరాల సమూహం
- శ్రీ నాథ్ జి మందిరం - రాజ సమంద్ జిల్లా
- అంబికా మాత మందిరం - మౌంట్ అబూ వద్ద కల జగత్ గ్రామంలో కలదు
- బిర్లా మందిర్ - జైపూర్
- కరణి మాత మందిరం - బికనీర్ నుంచి 30కి. మీ. ల దూరం లో కలదు
- ఏలింగి ఆలయం - ఉదయపూర్
- గల్తాజి మందిరం - జైపూర్
- మెహందీపూర్ బాలాజీ ఆలయం - కరౌలి
- సాయిధామ్ ఆలయం - పాలి
- సాలాసర్ బాలాజీ ఆలయం - చూరు జిల్లాలో గల సాలాసర్ పట్టణం లో కలదు
- Red temple - అజ్మీర్
- రాణిసతి ఆలయం - జుంజున్ నుంచి 24కి. మీ. ల దూరంలో ఉంది
- దేవ్ సోమనాథ్ ఆలయం - దుంగార్పూర్ నుంచి 24కి. మీ. ల దూరం లో ఉంది
- ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం - సవాయి మాధోపూర్ నుంచి 40కి మీ. ల దూరం లో కలదు
- తానొట్ మాత ఆలయం - జైసల్మేర్
- బైసాలదేవ్ మందిరం - టోంక్
- జగదీష్ మందిరం - ఉదయపూర్
- గోవింద్ దేవ్ జి మందిరం - జైపూర్
- దధి మాత ఆలయం - నాగౌర్
- సుండా మాత ఆలయం - జాలోర్
- నీలకంఠ్ ఆలయం - అల్వార్
- పరశురామ్ మహాదేవ్ మందిరం - పాలి
- పరహేదా శివ మందిర్ - బనస్వారా
- హర్షనాథ్ మందిరం - సీకర్
- సచియా మాత ఆలయం - జోధ్ పూర్
- త్రినేత్ర గణేష్ మందిరం - రణతంబోర్ కోట
- కాళికా మాత మందిరం - చిత్తోర్ గఢ్
- రనక్ పూర్ జైన్ మందిరం - రనక్ పూర్
- దిల్వారా జైన్ మందిరం - మౌంట్ అబూ
- భందాసర్ జైన్ మందిర్ - బికనీర్
ప్రసిద్ధులైనవారు
- మహారణా ప్రతాప్ సింగ్ - మేవాడ్
- రావల్ మల్లినాథ
- బప్పా రావల్
- ప్రిథ్వి రాజ్ చౌహన్ - అజ్మీర్
- రావ్ హమ్మిర్ దేవ్ చౌహన్ - రణతంబోర్, ప్రిథ్వీరాజ్ చౌహన్ యొక్క మనుమడు
- కన్హాడ్ దేవ్ సొంగార చౌహన్ - జాలోర్
- బీరం దేవ్ సొంగార చౌహన్ - జాలోర్
- రాణా సంగా - మేవాడ్
- రావ్ బికా - బికనీర్
- రావ్ జోధా - జోధ్ పూర్
- రాజా మాన్ సింగ్ - జైపూర్
- అమర్ సింగ్ రాథోడ్ - నాగౌర్
- వీర్ దుర్గ దాస్ రాథోడ్
- మీర్జా రాజా జై సింగ్ 1 - జైపూర్
- సవాయ్ జై సొంగ్ 11 - జైపూర్
- బదన సింగ్
- రావ్ షేఖాజి
- మహారావు శ్రదుల్ సింగ్ - జుంజున్
- మహారణా హమ్మిర్ - మేవాడ్
- రాణా కుంభా - మేవాడ్
- మహారాజ జస్వంత్ సింగ్ - జోధ్ పూర్
- మహారాజ గంగా సింగ్ - బికనీర్
- మహారాజ సూరజ్ మల్
- మీరాబాయి
- పన్నా దాయి
- గోర మరియు బాదల్
- హద రాణి
- భామషా
- రాణి పద్మిని
- మహారణా ఉదయ్ సింగ్ మేవాడ్
రాజస్థాన్ గురించి తెలిసాక రాజస్థాన్ నీ చూడాలనిపిస్తుంది కదూ తప్పక చుడండి. తరువాతి విహార యాత్ర రాజస్థాన్.











Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box