దారిద్ర్య రేఖని నిర్దారించే పద్ధతులు
నిర్దారణ పద్ధతులు
ప్రణాళికా సంఘం నిమించిన ప్రతి ఒక్క నూతన నిపుణుల బృందం పేదరికఅంచనా పధ్ధతిలో అనేక పర్యాయాలు మార్పులు చేసి సవరించింది. ప్రతి నిపుణుల బృందం/టాస్క్ ఫోర్స్ దారిద్ర్యరేఖను నిర్ణయించడానికి కొన్ని పద్దతులను రూపొందించింది. 1971 నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేలరీల వినియోగం ఖర్చు పై ప్లానింగ్ కమిషన్ దారిద్ర్యరేఖ వర్గీకరణను రూపొందించింది. 1979 వరకు సంప్రదాయ పేదరిక అంచనా ప్రకారం పేదరికం అంటే తక్కువ ఆదాయం లేదా అవసరమైన ఆదాయం లేకపోవడం. 1979 లో వై. కె. అలగ్ కమిటీ సిఫార్సు ద్వారా కొత్త విధానం ఆచరించడం మొదలు పెట్టారు. ఎంత మందికి పౌష్టికాహారం, కేలరీల కొరత అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఈ విధానం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2100 కన్నా తక్కువ కేలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కంటే తక్కువ కేలరీలు లభ్యం కానీ వాళ్లందరూ దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నట్లే. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ శారీరక, కాయకష్టం చేస్తారు కాబట్టి గ్రామీణ ప్రజల కు కేలరీలు ఎక్కువ ఉండాలని అలగ్ కమిటీ వివరించింది.
1993లో లక్డావాలా కమిటీ కొత్త సిఫార్సులు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 2100, పట్టణాల్లో 2400 కనీస అవసర కేలరీలలో మార్పు చేయకుండా అలాగే ఉంచుతూ తలసరి వినియోగ వ్యయం గృహాల ఆధారంగా ఆ కమిటీ దారిద్ర్య రేఖను నిర్ణయించింది. "కన్జయూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ లేబరర్స్", "కన్జయూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబరర్స్" ను పరిగణలోకి తీసుకుంది. 2011 వరకు అధికారిక దారిద్ర్య రేఖలు పూర్తిగా లక్డావాలా కమిటీ సిఫార్సుల పై ఆధారపడి ఉన్నాయి.
1993-94 వరకు "నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO)" అన్ని వస్తువుల ధరలు 30 రోజులకు ముందు ఏ ధర ఉండేదో అదే ప్రామాణికంగా తీసుకొనేది. దాంతో ముందు సంవత్సరాల ధరలతో పోలిక, విశ్లేషణ కష్టమయ్యేది. ఎట్టకేలకు 1999-2000లో NSSO మిక్సడ్ రిఫరెన్స్ పీరియడ్ (MRP) పద్దతిని ప్రవేశ పెట్టింది
2005 లో సురేష్ టెండూల్కర్ కమిటీని నియమించారు. 2009 లో ఆ కమిటీ మరో కొత్త ప్రతిపాదన చేసింది. ప్రజలకు ఆహారంతో పాటు కనీస అవసరాలైన విద్య, ఆరోగ్యం, వస్తువులు, వినోదం వంటి వాటి పై చేసిన ఖర్చులను పరిగణలోకి తీసుకోని దారిద్ర్య రేఖ విస్తృత నిర్వచనానికి నాంది పలికింది. మరో మార్పు కూడా చేసింది. కనీస అవసర కేలరీలను తగ్గించాలని నిర్ణయించి, పట్టణ ప్రాంతల్లి రోజుకు వ్యక్తికీ 2100 నుంచి 1776 కేలరీలకు కుదించి దారిద్ర్యరేఖను నిర్ణయించడం మొదలుపెట్టింది. ఈ కమిటీ ప్రకారం 2004-05లో భారతదేశం లో దారిద్ర్యరేఖకు దిగువ ఉండేవారు. 27.5 శాతం, 2009 లో అది 37.2 శాతానికి పెరిగింది. టెండూల్కర్ ప్యానెల్ ప్రకారం రోజువారీ తలసరి వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 27, పట్టణ ప్రాంతాల్లో రూ.33.
టెండూల్కర్ కమిటీ తరువాత సి. రంగరాజన్ కమిటీని నియమించారు. ఆ కమిటీ రోజువారీ తలసరి వ్యయ పరిమితులను గ్రామీణ ప్రాంతాల్లో రూ. 32, పట్టణ ప్రాంతాల్లో రూ. 47కు మార్చింది. రంగరాజన్ కమిటీ అంచనా ప్రకారం 2011-12లో పేదరికం దాదాపు 30% గా ఉంది.
ప్రపంచ బ్యాంకు కొలమానం
కొన్ని దశాబ్దాలుగా సంపూర్ణ దారిద్ర్యరేఖను నిష్పాక్షికంగా నిర్వచించడానికి ప్రపంచబ్యాంకు ప్రయత్నించింది. యాదృచ్చికంగా, ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన సంపూర్ణ దారిద్ర్య రేఖ మన దేశపు దారిద్ర్య రేఖ కొలమానం తో ఇంచుమించు సమానం.ఒకే ఒక తేడా ఏముంటే భారత దారిద్ర్య రేఖ తలసరి రూపాయలలో, ప్రపంచ బ్యాంకు దారిద్ర్య రేఖ దినసరి తలసరి డాల్లర్లలో ఉంది. ఇటీవల, ప్రపంచ బ్యాంకు దేశ దారిద్ర్య రేఖను మూడు తరగతులుగా విభజించింది.
తక్కువ ఆదాయ దేశాలు
ఆఫ్ఘనిస్తాన్, గినియా - బిస్సావు, సియర్రా లియోన్, హైతి, సోమాలియా, ఉత్తర కొరియా, దక్షిణ సూడాన్, బురుండి, లైబీరియా, సిరియన్ అరబ్ రిపబ్లిక్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మడగాస్కర్, టాజీకిస్తాన్, చాడ్, మాలావి, తాంజనియా, కొమొరోస్, మాలీ, టోగో, కాంగో, మొజాంబిక్, ఉగాండా, ఎరిత్రియా, నేపాల్, యెమెన్, ఇథియోపియా, నెగర్, జింబాంబ్వే, జాంబియా, రువాండ, సెనెగల్.
దిగువ మధ్య తరగతి దేశాలు
అంగోలా, ఇండోనేషియా, పపువా న్యూగినియా, బాంగ్లాదేశ్, కెన్యా, ఫిలిప్పీన్స్, భూటాన్, బొలీవియా, కొసావో, సోలమన్ దీవులు, శ్రీలంక, కంబోడియా, లావోస్, సుడాన్, కామెరూన్, స్వాజిలాండ్, టిమోర్ -లేస్టే, ట్యునీషియా, మోల్డోవా, ఉక్రెయిన్, ఈజిప్ట్, మంగోలియా, ఉజ్జెకిస్తాన్, ఎల్ సాల్విడార్, మొరాకో, జార్జియా, మయన్మార్, వియత్నాం, ఘన, నికరాగువా, వెస్ట్ బ్యాంక్, గాజ, నైజీరియా, ఇండియా, పాకిస్తాన్.
ఎగువ మధ్య తరగతి దేశాలు
అల్బేనియా, ఫిజి, నమీబియా, అల్జీరియా, గేబన్, అమెరికన్ సమోవా, గ్రెనడా, పరాగ్వే, అర్మేనియా, పెరు, గ్వాటెమాల, అజర్ బైజాన్, గయాన, రుమేనియా, బెలారస్, ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్, రష్యన్ ఫెడరేషన్, బ్రెజిల్, ఇరాక్, బోస్నియా, జమైకా, సెర్బియా, జోర్డాన్, సౌతాఫ్రికా, కజికిస్థాన్, సెయింట్ లూసియా, బల్గెరియా, లెబనాన్, చైనా, లిబియా, కొలంబియా, మాసిడోనియా, థాయిలాండ్, కోస్టారికా, మలేషియా, టోంగా, క్యూబా, మాల్దీవులు, టర్కీ, మార్షల్ దీవులు, తుర్క్ మెనిస్థాన్, డొమినికన్ రిపబ్లిక్, మారిషస్, మెక్సికో, వెనిజులా, ఈక్వెడార్, మోంటెనెగ్రో.
ఎగువ తరగతి దేశాలు
అం డొర్రా, జర్మనీ, ఒమన్, ఆంటిగ్వా, జిబ్రాల్టర్, అర్జెంటీనా, గ్రీస్, పనామ, గ్రీన్ లాండ్, పోలాండ్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఆస్ట్రియ, హాంకాంగ్, బహమాస్, హంగరి, ఖతార్, బహ్రెయిన్, ఐస్ లాండ్, బార్బడోస్, ఐర్లాండ్, సౌదీ, అరేబియా, బెల్జియం, బెర్ముడా, ఇజ్రాయెల్, సింగపూర్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, ఇటలీ బ్రూనై, దారుసాలం, జపాన్, స్లోవెక్ రిపబ్లిక్, కెనడా, దక్షిణ కొరియా, స్లోవేనియా, కేమాన్ దీవులు, కువైట్, స్పెయిన్, లాత్వియా, సెయింట్ కిట్స్, చిలీ, క్రోవేషియా, లిథువేనియా, స్వీడన్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, సైప్రస్, మకావు, తైవాన్, చెక్ రిపబ్లిక్, మాల్టా, ట్రినిడా, టొబాగో, డెన్మార్క్, మొనాకో, ఎస్తోనియా, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్ డం, ఫిన్లాండ్, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, ఉరుగ్వే.
గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపిఐ) 2018
యునైటెడ్ నేషన్స్ దేవలప్ మెంట్ ప్రోగ్రాం (UNDP) ఆక్సఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ ఇన్సియేటివ్ (OPHI) కలిసి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) అనే కొత్త ప్రామాణికాన్ని అభివృద్ధి చేశాయి. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) ప్రపంచ మొత్తంగా 105 దేశాలకు వర్తిస్తుంది. ప్రపంచ జనాభాలో 75శాతం మంది లేదా 5.7 బిలియన్ల ప్రజలు ఈ 105 దేశాలలో నివసిస్తున్నారు. ఈ నిష్పత్తిలో 23.3 శాతం ప్రజలు (1.3 బిలియన్లు) బహుమితీయ పేదరికం అనుభవిస్తున్నట్లు గుర్తించారు.ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన "సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్" వైపుగా - "2030 కల్లా అన్ని రూపాల్లో పేదరికాన్ని అంతం చేయడానికి" ప్రతిస్పందనగా ఈ బహుమితీయ పేదరిక సూచీ నిర్మించారు. 105 దేశాల నుంచి 103 కోట్ల మందిలో బహుమితీయ పేదలు, ఆయా దేశాల్లో నివసిస్తున్న 23.3శాతం ప్రజలు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, తగిన పోషణ, ప్రాథమిక విద్య, వంటి సౌకర్యాలకు దూరం అవుతారు.
83 శాతం మంది బహుమితీయ పేద ప్రజలు ఉప - సహారా ఆఫ్రికా, దక్షిణ ఆసియా లో నివసిస్తున్నారు. బహుమితీయ పేద ప్రజల్లో మూడింట రెండొంతులు లేదా 88 కోట్ల మంది మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. బహుమితీయ పేదల్లో 49.9 శాతం 0-17 వయస్సు వారు. ఉప - సహారా ఆఫ్రికా పిల్లలలో దాదాపు మూడింట రెండు వంతులు అంటే 64 శాతం బహుమితీయ పేదలుగా ఉన్నారు. దక్షిణాసియాలో 39 శాతం మంది పిల్లలు బహుమితీయ పేదలుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో బహుమితీయ సాంద్రత పేదరికం తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా, గ్రామీణ ప్రాంతాల్లో బహుమితీయ పేదరికం లో 101 కోట్ల మంది ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య రెండు కోట్లు. సుమారు 60 కోట్ల మంది తీవ్రమైన పేదరికం లో జీవిస్తున్నారు, వారు కనీస జీవన ప్రమాణాలకు నోచుకోలేదు.
దేశం లో 27 కోట్ల ప్రజలు 2005 - 06, 2015 - 16 మధ్య దారిద్ర్యరేఖ నుంచి వెలుపలికి వచ్చారు. కానీ దేశం లో ఇప్పటికి అత్యధిక సంఖ్యలో 36 కోట్ల మంది దారిద్ర్యరేఖ కి దిగువ ఉన్నారు, అయినప్పటికీ, పదేళ్లలో భారత దేశంలో పేదలు 55% నుంచి 28%కి తగ్గారు. భరత్ తరువాత పేదలు అత్యధిక సంఖ్యలో ఇన్స్ దేశాల్లో నైజీరియా (9 కోట్లు), ఇథియోపియా (8.6 కోట్లు), పాలిస్తాన్(8.5 కోట్లు), బాంగ్లాదేశ్ (6.7 కోట్లు) ఉన్నాయి.
బీహార్, జార్ఖండ్ , ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో 19.6 కోట్ల మంది పేదలు ఉన్నారు. అయిటర్ పురోగతి కూడా ఉంది. పేదరిక నివారణ చర్యలతో జార్ఖండ్ లో పేదరికం తగ్గు ముఖం పట్టింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గడ్, నాగాలాండ్ లలో కొంచెం తగ్గుతుంది. ఢిల్లీ, కేరళ, గోవాలలో పేదరికం తక్కువగా ఉంది.
రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాల్లో దారిద్ర్య రేఖ
భారత రీజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల శాతం
గోవా - 5.09
కేరళ - 7.05
హిమాచల్ ప్రదేశ్ - 8.06
సిక్కిం - 8.19
పంజాబ్ - 8.26
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ - 9.20
జమ్మూ&కశ్మీర్ - 10.35
హర్యానా - 11.16
ఉత్తరాఖండ్ - 11.26
తమిళనాడు - 11.28
మేఘాలయ - 11.87
త్రిపుర - 14.05
రాజస్థాన్ - 14.71
గుజరాత్ - 16.63
మహారాష్ట్ర - 17.35
నాగాలాండ్ - 18.88
పచ్చిమ బెంగాల్ - 19.98
మిజోరం - 20.87
కర్ణాటక - 20.91
ఉత్తరప్రదేశ్ - 29.43
మధ్యప్రదేశ్ - 31.65
అసోం - 31.98
ఒడిషా - 32.59
బీహార్ - 33.74
అరుణాచల్ ప్రదేశ్ - 34.67
మణిపూర్ - 36.89
జార్ఖండ్ - 36.96
ఛత్తీస్ గఢ్ - 39.93
అండమాన్ నికోబార్ - 1.00
లక్షద్వీప్ - 2.77
పుదుచ్ఛరి - 9.69
డామన్, డయ్యు - 9.86
ఢిల్లీ - 9.91
చండీగఢ్ - 21.81
దాద్రా & నగర్ హవేలీ - 39.31
మొత్తం దేశ సగటు - 21.92

- పేద దేశాలు - రోజుకు వ్యక్తికీ 1.9 డాలర్లు
- దిగువ మధ్యస్థ ఆదాయ దేశాలు - రోజుకు వ్యక్తికీ 3.2 డాలర్లు
- ఉన్నత మధ్య ఆదాయ దేశాలు రోజుకు వ్యక్తికీ 5.2 డాలర్లు
- కొత్త ప్రమాణాల ప్రకారం రోజుకు 21.70 డాలర్లు ఆదాయం దేశాలను అధిక ఆదాయ దేశాలుగా గుర్తించాలి
- ప్రపంచ బ్యాంకు ప్రకారం భారత దేశం ఇప్పుడు పేద దేశం కాదు. దిగువ మధ్య ఆదాయ దేశం.
- ప్రపంచ బ్యాంకు "ద్రవ్య మెట్రిక్" విధానాన్ని ఉపయోగిస్తుంది. అంతర్జాతీయ దారిద్ర్య రేఖను కనుగోలు శక్తి లేదా పర్చేజింగ్ పవర్ పారిటీ (PPP) అనుసరించి ప్రతి దేశ మారకపు విలువలోకి మారుస్తుంది. దేశీయ దారిద్ర్య రేఖల కంటే స్థానిక ఆదాయం తక్కువగా ఉన్న వ్యాక్యూల సంఖ్యను గుర్తించడం కోసం ఇది జాతీయ గృహ సర్వేలను ఉపాయోగిస్తుంది.
- 1980 నుంచి మన దేశం పేదరికం పై స్థిరమైన పురోగతి స్ఫహించింది. పేదరికం రేటు ప్రతి ఏడాది తగ్గుముఖం పడుతూ ఉంది.
- రోజుకి 1.9 డాలర్ల కంటే తక్కువ ఆదాయ దేశాలను తీవ్ర "పేదరికంగా" ప్రపంచ బ్యాంకు నిర్వచిస్తుంది.
- ప్రపంచ వ్యాప్తంగా సుమారు 760 మిలియన్ల మంది తీవ్ర పేదరికం అనుభవిస్తున్నారు. 1990 లో 1.9 బిలియన్ల మంది ఉండేవారు.
- పేదరికాన్ని కొలిచేందుకు ప్రపంచ బ్యాంకు అవలంభించే విధానానికి వ్యతిరేకంగా విమర్శలు కూడా లేకపోలేదు.
- రోజుకి 1.9 డాలర్లు తో తీవ్ర పేదరికంతో నివసిస్తున్న వారు ప్రంపంచ జనాభాలో 10.7% లేదా 760 మిలియన్ల మంది ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనా.
- 2030 నాటికీ తీవ్రమైన పేదరికాన్ని నిర్ములించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకొంది.
తక్కువ ఆదాయ దేశాలు
ఆఫ్ఘనిస్తాన్, గినియా - బిస్సావు, సియర్రా లియోన్, హైతి, సోమాలియా, ఉత్తర కొరియా, దక్షిణ సూడాన్, బురుండి, లైబీరియా, సిరియన్ అరబ్ రిపబ్లిక్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మడగాస్కర్, టాజీకిస్తాన్, చాడ్, మాలావి, తాంజనియా, కొమొరోస్, మాలీ, టోగో, కాంగో, మొజాంబిక్, ఉగాండా, ఎరిత్రియా, నేపాల్, యెమెన్, ఇథియోపియా, నెగర్, జింబాంబ్వే, జాంబియా, రువాండ, సెనెగల్.
దిగువ మధ్య తరగతి దేశాలు
అంగోలా, ఇండోనేషియా, పపువా న్యూగినియా, బాంగ్లాదేశ్, కెన్యా, ఫిలిప్పీన్స్, భూటాన్, బొలీవియా, కొసావో, సోలమన్ దీవులు, శ్రీలంక, కంబోడియా, లావోస్, సుడాన్, కామెరూన్, స్వాజిలాండ్, టిమోర్ -లేస్టే, ట్యునీషియా, మోల్డోవా, ఉక్రెయిన్, ఈజిప్ట్, మంగోలియా, ఉజ్జెకిస్తాన్, ఎల్ సాల్విడార్, మొరాకో, జార్జియా, మయన్మార్, వియత్నాం, ఘన, నికరాగువా, వెస్ట్ బ్యాంక్, గాజ, నైజీరియా, ఇండియా, పాకిస్తాన్.
ఎగువ మధ్య తరగతి దేశాలు
అల్బేనియా, ఫిజి, నమీబియా, అల్జీరియా, గేబన్, అమెరికన్ సమోవా, గ్రెనడా, పరాగ్వే, అర్మేనియా, పెరు, గ్వాటెమాల, అజర్ బైజాన్, గయాన, రుమేనియా, బెలారస్, ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్, రష్యన్ ఫెడరేషన్, బ్రెజిల్, ఇరాక్, బోస్నియా, జమైకా, సెర్బియా, జోర్డాన్, సౌతాఫ్రికా, కజికిస్థాన్, సెయింట్ లూసియా, బల్గెరియా, లెబనాన్, చైనా, లిబియా, కొలంబియా, మాసిడోనియా, థాయిలాండ్, కోస్టారికా, మలేషియా, టోంగా, క్యూబా, మాల్దీవులు, టర్కీ, మార్షల్ దీవులు, తుర్క్ మెనిస్థాన్, డొమినికన్ రిపబ్లిక్, మారిషస్, మెక్సికో, వెనిజులా, ఈక్వెడార్, మోంటెనెగ్రో.
ఎగువ తరగతి దేశాలు
అం డొర్రా, జర్మనీ, ఒమన్, ఆంటిగ్వా, జిబ్రాల్టర్, అర్జెంటీనా, గ్రీస్, పనామ, గ్రీన్ లాండ్, పోలాండ్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఆస్ట్రియ, హాంకాంగ్, బహమాస్, హంగరి, ఖతార్, బహ్రెయిన్, ఐస్ లాండ్, బార్బడోస్, ఐర్లాండ్, సౌదీ, అరేబియా, బెల్జియం, బెర్ముడా, ఇజ్రాయెల్, సింగపూర్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, ఇటలీ బ్రూనై, దారుసాలం, జపాన్, స్లోవెక్ రిపబ్లిక్, కెనడా, దక్షిణ కొరియా, స్లోవేనియా, కేమాన్ దీవులు, కువైట్, స్పెయిన్, లాత్వియా, సెయింట్ కిట్స్, చిలీ, క్రోవేషియా, లిథువేనియా, స్వీడన్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, సైప్రస్, మకావు, తైవాన్, చెక్ రిపబ్లిక్, మాల్టా, ట్రినిడా, టొబాగో, డెన్మార్క్, మొనాకో, ఎస్తోనియా, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్ డం, ఫిన్లాండ్, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, ఉరుగ్వే.
గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపిఐ) 2018
యునైటెడ్ నేషన్స్ దేవలప్ మెంట్ ప్రోగ్రాం (UNDP) ఆక్సఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ ఇన్సియేటివ్ (OPHI) కలిసి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) అనే కొత్త ప్రామాణికాన్ని అభివృద్ధి చేశాయి. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) ప్రపంచ మొత్తంగా 105 దేశాలకు వర్తిస్తుంది. ప్రపంచ జనాభాలో 75శాతం మంది లేదా 5.7 బిలియన్ల ప్రజలు ఈ 105 దేశాలలో నివసిస్తున్నారు. ఈ నిష్పత్తిలో 23.3 శాతం ప్రజలు (1.3 బిలియన్లు) బహుమితీయ పేదరికం అనుభవిస్తున్నట్లు గుర్తించారు.ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన "సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్" వైపుగా - "2030 కల్లా అన్ని రూపాల్లో పేదరికాన్ని అంతం చేయడానికి" ప్రతిస్పందనగా ఈ బహుమితీయ పేదరిక సూచీ నిర్మించారు. 105 దేశాల నుంచి 103 కోట్ల మందిలో బహుమితీయ పేదలు, ఆయా దేశాల్లో నివసిస్తున్న 23.3శాతం ప్రజలు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, తగిన పోషణ, ప్రాథమిక విద్య, వంటి సౌకర్యాలకు దూరం అవుతారు.
83 శాతం మంది బహుమితీయ పేద ప్రజలు ఉప - సహారా ఆఫ్రికా, దక్షిణ ఆసియా లో నివసిస్తున్నారు. బహుమితీయ పేద ప్రజల్లో మూడింట రెండొంతులు లేదా 88 కోట్ల మంది మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. బహుమితీయ పేదల్లో 49.9 శాతం 0-17 వయస్సు వారు. ఉప - సహారా ఆఫ్రికా పిల్లలలో దాదాపు మూడింట రెండు వంతులు అంటే 64 శాతం బహుమితీయ పేదలుగా ఉన్నారు. దక్షిణాసియాలో 39 శాతం మంది పిల్లలు బహుమితీయ పేదలుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో బహుమితీయ సాంద్రత పేదరికం తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా, గ్రామీణ ప్రాంతాల్లో బహుమితీయ పేదరికం లో 101 కోట్ల మంది ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య రెండు కోట్లు. సుమారు 60 కోట్ల మంది తీవ్రమైన పేదరికం లో జీవిస్తున్నారు, వారు కనీస జీవన ప్రమాణాలకు నోచుకోలేదు.
దేశం లో 27 కోట్ల ప్రజలు 2005 - 06, 2015 - 16 మధ్య దారిద్ర్యరేఖ నుంచి వెలుపలికి వచ్చారు. కానీ దేశం లో ఇప్పటికి అత్యధిక సంఖ్యలో 36 కోట్ల మంది దారిద్ర్యరేఖ కి దిగువ ఉన్నారు, అయినప్పటికీ, పదేళ్లలో భారత దేశంలో పేదలు 55% నుంచి 28%కి తగ్గారు. భరత్ తరువాత పేదలు అత్యధిక సంఖ్యలో ఇన్స్ దేశాల్లో నైజీరియా (9 కోట్లు), ఇథియోపియా (8.6 కోట్లు), పాలిస్తాన్(8.5 కోట్లు), బాంగ్లాదేశ్ (6.7 కోట్లు) ఉన్నాయి.
బీహార్, జార్ఖండ్ , ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో 19.6 కోట్ల మంది పేదలు ఉన్నారు. అయిటర్ పురోగతి కూడా ఉంది. పేదరిక నివారణ చర్యలతో జార్ఖండ్ లో పేదరికం తగ్గు ముఖం పట్టింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గడ్, నాగాలాండ్ లలో కొంచెం తగ్గుతుంది. ఢిల్లీ, కేరళ, గోవాలలో పేదరికం తక్కువగా ఉంది.
రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాల్లో దారిద్ర్య రేఖ
భారత రీజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల శాతం
గోవా - 5.09
కేరళ - 7.05
హిమాచల్ ప్రదేశ్ - 8.06
సిక్కిం - 8.19
పంజాబ్ - 8.26
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ - 9.20
జమ్మూ&కశ్మీర్ - 10.35
హర్యానా - 11.16
ఉత్తరాఖండ్ - 11.26
తమిళనాడు - 11.28
మేఘాలయ - 11.87
త్రిపుర - 14.05
రాజస్థాన్ - 14.71
గుజరాత్ - 16.63
మహారాష్ట్ర - 17.35
నాగాలాండ్ - 18.88
పచ్చిమ బెంగాల్ - 19.98
మిజోరం - 20.87
కర్ణాటక - 20.91
ఉత్తరప్రదేశ్ - 29.43
మధ్యప్రదేశ్ - 31.65
అసోం - 31.98
ఒడిషా - 32.59
బీహార్ - 33.74
అరుణాచల్ ప్రదేశ్ - 34.67
మణిపూర్ - 36.89
జార్ఖండ్ - 36.96
ఛత్తీస్ గఢ్ - 39.93
అండమాన్ నికోబార్ - 1.00
లక్షద్వీప్ - 2.77
పుదుచ్ఛరి - 9.69
డామన్, డయ్యు - 9.86
ఢిల్లీ - 9.91
చండీగఢ్ - 21.81
దాద్రా & నగర్ హవేలీ - 39.31
మొత్తం దేశ సగటు - 21.92
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box