బియ్యంలో రకాలు ఆరోగ్య ఫలితాలు

డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగానే అన్నం వడ్డించుకుంటాం... రైస్ సన్నంగా నాజూకుగా ఉండి  తినడానికి  హాయిగా ఉంటే  చాలు... మరే విషయాన్ని  పట్టించుకోము. కానీ మనం తినే రైస్ లాంటి రకాలు పదుల  సంఖ్యలో ఉన్నాయని, ఒక్కోరకం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుందని తెలుసా. రంగు, రూపు, నాణ్యత బట్టి బియ్యం నుంచి మనకు అందె పోషకాల తీరు కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్ని రకాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు పరిస్కారంగా పని చేస్తే, మరికొన్ని రకాలు సమస్యకు కారణం కూడా అవుతాయి. బియ్యంలో రకాలు, వాటి ప్రత్యేకతలు, ఆరోగ్య ఫలితాలు తెలుసుకుందాం.


Brown rice
బ్రౌన్  రైస్...
అత్యధిక, బలమైన పోషకాలు ఉండే రైస్ బ్రౌన్ రైస్. దీనిలో విటమిన్స్, మీనరల్స్ అత్యధికంగా ఉంటాయి. దీనిలో  కేలరీల కంటే పీచు  అధికంగా ఉంటుంది. ఈ రైస్ వాడడం వలన రక్తం లో చక్కర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. అందుకే ఈ రైస్ ను ఎక్కువగా డయాబెటిస్ రోగులు వినియోగిస్తారు. ఈ రైస్ లో పైన వున్న  పొట్టును  మాత్రమే తొలగించడం వలన బియ్యం లో వుండే ఏ పోషక పదార్థాలు ఇది కోల్పోదు. బ్రౌన్ రైస్ ఉడికేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణమయ్యేందుకు కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది.


Black rice
బ్లాక్ రైస్...
థాయిలాండ్  లో ఎక్కువగా ఉపయోగించే రైస్ బ్లాక్ రైస్. తమిళనాడు లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రైస్ వినియోగిస్తారు. అల్జీమర్స్, డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి  ఇది మంచి ఆహరం. యాంటీ ఆక్షడెంట్లు, యాంటీ ఇన్ ప్ల మేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. చెట్టియార్ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఈ రకం రైస్ ను వినియోగిస్తారు.


Basmati rice

బాస్మతి రైస్...
మనకు లభించే రైస్ లలో ఇతర వెరైటీల కంటే బాస్మతి  రైస్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దీనిలో గ్లైసీమిక్  ఇండెక్స్ మోస్తరుగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ బియ్యం తినడం ఏంతో ప్రయోజనవంతం.
బాస్మతి  బియ్యం లోనూ, పాలిష్ పట్టిన బ్రౌన్ రకం, బాగా మిల్లింగ్ చేసిన వెరైటీలు వున్నాయి. బాస్మతి రైస్ కు ప్రత్యేక రూపం, పరిమళం ఉంటుంది. ఈ రైస్ అమెరికా లో పండిస్తున్నప్పటికీ మన దేశమే ప్రత్యేకం.


Jasmine rice
జాస్మిన్ రైస్...
జాస్మిన్ రైస్ ను థాయిలాండ్ లో ఎక్కువగా పండిస్తారు. ఈ రైస్ లో ఉండే అమైనో యాసిడ్స్, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. బాస్మతి రైస్ లాగే ఈ రైస్ ఆకారం కూడా ఉంటుంది.


Red rice
రెడ్ రైస్...
రెడ్ రైస్ మిగిలిన రైస్ లకు భిన్నంగా ఉంటుంది. తినడానికి రుచిగా కూడా ఉండదు. కానీ పోషకాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి. బాడీ ఫిట్ గా ఉండాలనుకునే వారికి ఈ రైస్ ఒక ఆప్షన్ అని చెప్పాలి. ఈ రైస్ లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తం లో, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఎర్ర రక్త కణాలు, సెరోటోనిన్ ఇచ్చే బి6 విటమిన్ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. DNA కణాల  ఉత్పత్తికి సహాయపడుతుంది. హిమాలయాలు,  నేపాల్, భూటాన్  దేశాల్లో ఈ తరహా రైస్ ఎక్కువగా పండిస్తారు.


White rice
వైట్ రైస్...
వైట్ రైస్ అనేది సాధారణంగా అందరూ తినడానికి ఉపయోగపడేది. ఇది అతి తేలిగ్గా  జీర్ణమవుతుంది. ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఇందులో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను అధికంగా ఇస్తుంది. అన్నం తిన్న గంట వ్యవధిలోనే జీర్ణమవుతుంది. పిల్లలకు ఎక్కువగా ఈ రైస్ వాడడానికి ఇదే కారణం. పెద్దవాళ్లకు కూడా ఇది సులభమైన ఆహరం. వైట్ రైస్ అంటే పాలిస్ డ్  బియ్యం. మిల్లింగ్ లో బియ్యం పై పొర  తొలగించడం వల్ల ప్రోటీన్లను  కోల్పోతుంది. వైట్ రైస్ అంటే శుద్ధి చేసిన పిండితో సమానం.


Wild rice

వైల్డ్ రైస్...
బ్రౌన్ రైస్ తో పోలిస్తే వైల్డ్ రైస్ లో ప్రోటీన్లు ఎక్కువ. కార్బోహైడ్రేట్స్ తక్కువ. ఈ రకం లో విటమిన్ ఎ, పోలిక్  యాసిడ్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. అమెరికాలో ఈ వైల్డ్ రైస్ ఎక్కువగా వినియోగిస్తారు.


Short grain rice



షార్ట్ గ్రెయిన్...
ఇది చూసేందుకు చిన్నగా, గుండ్రంగా ఉంటుంది. రైస్ ఉడికించిన తరువాత ఉబ్బుతుంది. దీనిలో గ్లైసిమిక్  ఇండెక్స్ అధికంగా లభిస్తుంది. అలాగే విటమిన్ బి,  పొటాషియం కూడా ఎక్కువగా లభిస్తుంది.

పోషకాల పరంగా తేడా 
బ్రౌన్ రైస్,  వైట్ రైస్ రెండింటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువే. కాకపొతే బ్రౌన్ రైస్ లో పొట్టు  తప్ప మరే భాగం తొలగించరు.బ్రౌన్ రైస్ లో  బియ్యం పైన ఉండే జెర్మలను తొలగించరు. పొట్టు తో ఉన్న రైస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. వైట్ రైస్ లో వీటిని తొలగిస్తారు. బ్రౌన్ రైస్ లో  మెగ్నీషియం, ఇతర మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. వైట్ రైస్ లో ఒక గ్రాము ఫైబర్ (పీచు పదార్థం) ఉంటే బ్రౌన్ రైస్ లో మాత్రం నాలుగు గ్రాముల పీచు పదార్థము లభిస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కార్బోహైడ్రేట్లు  రక్తం లో చక్కెరలుగా మారే వేగం తగ్గుతుంది. బ్రౌన్ రైస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచివని  డాక్టర్ లు సూచిస్తుంటారు. చిన్నారులకు, 60 ఏళ్లు  పై బడిన వారు బ్రౌన్ రైస్ వాడకూడదు. దీని వల్ల పెద్ద ఇబ్బందులు ఏమి లేకున్నా జీర్ణం సమస్యలు తలెత్తుతాయి.

Comments