హెన్రీ వర్గీకరణ

చేతిని పరిశీలనగా చూస్తే గీతలు కనిపిస్తాయి. వేళ్ల మీద ఉండే గీతలు వేలి ముద్రలు(finger prints). ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకలా ఉండవు. ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటాయి. ఈ విషయాన్ని చెక్ రీపబ్లిక్ చెందిన ప్ఫొఫెసర్ "జాన్ ఎవాన్జలిస్ట్ పర్కీనే" 1823 లో తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేేేేశాడు. అయితే 16 వ శతాబ్దము  నుంచే  ఫింగర్ ప్రింట్స్  పై  విలియం జేమ్స్  అనే  పరిశోధకుడు ప్రయత్నాలు
ప్రారంభించినట్లు ఆధారాలున్నాయి. అల్ఫోన్సే బెర్టిల్లాన్  అనే శాస్త్రవేత్త 1879లో
ఆంథ్రోపోమెట్రీ విధానాన్ని తయారు  చేశాడు. నేర పరిశోధనల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఫింగర్ ప్రింట్స్ సేకరణ విధానానికి ఆంథ్రోపోమేట్రినే మూలం.


భారత్ లో  ఈ  విధానాన్ని 1892 లో  బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. రెండేళ్ల తర్వాత బెంగాల్ పోలీస్ అధికారి సర్ ఎడ్వర్డ్ హెన్రీ 'ఆంథ్రోపోమెట్రీ ' సాయంతో నేరాల్ని పరిశోధించడం  మొదలు పెట్టాడు. హేమ్ చంద్రబోస్,  అజీజుల్ హక్కే లతో కలిసి హెన్రీ 'క్వేలిముద్రా 'లుగా  వర్గీకరించాడు. అదే హెన్రీ వర్గీకరణగా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఇప్పుడు హంతకులు,  దొంగలను పట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారు. మనిషికి  పుట్టుకతో  వచ్చే  ఈ వేలి ముద్రలు చనిపోయేదాకా మారవు. ఒకే మనిషిలో ఏ  రెండు వేళ్ళకు కూడా ఒకే ముద్ర ఉండదు.

Comments